Renu Desai : పవన్ కళ్యాణ్ ని ఆ విషయం లో ఎంత తిట్టినా తప్పు లేదు.. రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్!

- Advertisement -

Renu Desai తో పవన్ కళ్యాణ్ విడిపోయినా తర్వాత ఆమె గురించి బహిరంగంగా ఒక్కసారి కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు. ఆమె ఆయనపై నిందలు వేసినా కూడా పవన్ కళ్యాణ్ నుండి ఒక్క సమాధానం కూడా రాలేదు. అది రేణు దేశాయ్ మీద పవన్ కళ్యాణ్ కి ఉన్న గౌరవం అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ విషయం లో ఒకేఒక్కసారి రేణు దేశాయ్ మాట తూలినా, అత్యధిక సార్లు ఆయన గురించి గొప్పగా మాట్లాడుతూ వచ్చేది.

Renu Desai
Renu Desai

పవన్ కళ్యాణ్ కి ప్రజాసేవ అంటే చాలా ఇష్టం అని. ఎంతో ఉన్నతమైన భావాలు ఉన్న వ్యక్తి అని, ఆయన నా విషయం లో తప్పు చేసి ఉండొచ్చు ఏమో కానీ, రాజకీయం గా మాత్రం నిజంగా సేవ చెయ్యాలనే భావన ఉందని, మీ రాజకీయాల కోసం పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియో పెట్టింది.

renu desai pawan kalyan

ఇప్పుడు రీసెంట్ గా ఆమె ప్రధాన పాత్ర పోషించిన ‘టైగర్ నాగేశ్వర రావు’ మూవీ ప్రొమోషన్స్ ఇస్తున్న సమయం లో పవన్ కళ్యాణ్ పై రాజకీయ విమర్శలు చేసే వారిపై రేణు దేశాయ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తుంది. ఆమె మాట్లాడుతూ ‘పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా విమర్శలు చేసుకునే స్వేచ్ఛ రాజకీయ నాయకులకు ఉంటుంది. కానీ వ్యక్తిగతంగా విమర్శలు చెయ్యడానికి ఏమి అధికారం ఉంటుంది?, ఆయన వ్యక్తిగతం లో మేము కూడా భాగమే.

- Advertisement -
renu desai

రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని నన్ను మీ స్వార్ధ రాజకీయాల కోసం వాడుకోవాలని చూస్తున్నారు. ఇది అసలు కరెక్ట్ కాదు, రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్ ని ఏమైనా తిట్టాలి అనుకుంటే తిట్టండి, వ్యక్తిగతం గురించి మాట్లాడకండి, అది సంస్కారం కాదు’ అంటూ రేణు దేశాయ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here