Veerasimha Reddy : సీనియర్ హీరో బాలయ్య నటించిన తాజా చిత్రం వీర సింహా రెడ్డి ఈ నెల 12 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది.. ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జనవరి 6 వ తేదీన ఒంగోలు లో ఘనంగా నిర్వహించడానికి మూవీ టీం సన్నాహాలు చేసింది..పాసులు కూడా ముద్రించారు..అన్నీ బాగానే జరుగుతున్నాయి అనుకున్న సమయంలో జగన్ సర్కార్ ఈవెంట్ కు అనుమతి నిరాకరిస్తునట్టు ఉత్తర్వులు జారీ చేసింది..
కాగా, ఒంగోలు లో జరగాల్సిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇప్పుడు హైదరాబాద్ లో జరగనుంది అని నిర్మాతలు తెలియచేసారు..దీనితో నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ ఒక్కసారిగా తీవ్రమైన నిరాశకు గురయ్యారు. మొన్నామధ్య కందుకూరులో నిర్వహించిన సభలో తొక్కిసలాట జరిగి 8 మంది చనిపోయిన విషయం తెలిసిందే..నిన్న గుంటూరులో కూడా చనిపొయారు..దీన్ని దృష్టిలో ఉంచుకొని జగన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది..అప్పటి నుండి ఇక రోడ్ షోస్ నిర్వహించరాదని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఒక చట్టం తెచ్చింది..
ఇప్పుడు వీరసింహా రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోలు లో జరగడం వల్ల జనాలు అసంఖ్యాకంగా వచ్చే అవకాశం ఉందని. దీని వల్ల మళ్ళీ తొక్కిసిలాట జరిగే ప్రమాదం ఉండడం వల్లే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అనుమతి ని ఇవ్వట్లేదని ఒంగోలు పోలీసులు ఈ సందర్భంగా తెలిపారు..మరోపక్క తెలుగు దేశం పార్టీ నాయకులూ వైసీపీ పార్టీ కావాలనే ఇలా చేస్తుందని..తెలుగు దేశం పార్టీ కి చెందిన వాడు కాబట్టే బాలయ్య ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు అంటూ ఆరోపిస్తున్నారు..ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అనుమతిని నిరాకరించడం తో బాలయ్య కచ్చితంగా జగన్ కి పెద్ద షాక్ ఇస్తారని అభిమానులు ఆశిస్తున్నారు..