Deepika Pilli : పిచ్చెక్కించే పోజులతో బీచ్ ఒడ్డున దీపిక పిల్లి రచ్చ



Deepika Pilli : ఇప్పుడు తెలుగు టెలివిజన్ లో బిజీ యాంకర్. టీవీలోనే కాదు ఈ బ్యూటీ ఓటీటీల్లోనూ షోస్ చేస్తోంది. టిక్ టాకర్ గా తన కెరీర్ స్టార్ట్ చేసింది దీపిక. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన దీపికకు ఈటీవీ ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది.

Deepika Pilli
Deepika Pilli

ఢీ షోలో యాంకర్ గా తన టీవీ కెరీర్ స్టార్ట్ చేసింది దీపిక. ఆ షోలో రష్మి, సుధీర్, హైపర్ ఆదిలతో కలిసి తెగ సందడి చేసింది. ఓ వైపు షోస్ చేస్తూనే మరోవైపు ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. 

Actress Deepika
Actress Deepika

ఎప్పటికప్పుడు సరికొత్తగా ఫొటోషూట్స్ చేస్తూ ఆ ఫొటోలను సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్ తో పంచుకుంటుంది దీపిక. తాజాగా ఈ బ్యూటీ పోస్టు చేసిన ఫొటోలు చూసి కుర్రాళ్లు మనసు పారేసుకుంటున్నారు. లేటెస్ట్ ఫొటోల్లో దీపిక గ్లామర్ ట్రీట్ అదిరిందంటూ కుర్రాళ్లు కామెంట్స్ చేస్తున్నారు. 

Deepika Photos
Deepika Photos

సముద్రపు ఒడ్డున వైట్ డ్రెస్ లో ఏంజిల్ లా ఉంది దీపిక పిల్లి . ఆ ఫొటోలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సూర్యకిరణాలు ఆమెను తాకుతుంటే.. ఆ వెచ్చని కిరణాల వెలుగులో తన్మయత్వం చెందుతూ దీపిక ఇచ్చిన పోజులకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.