Actress Nayanathra : లేడీ బాస్ నయన తార గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరంలేదు.. అధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో ప్రముఖంగా వినిపించే పేరు ఈమెదే.. అయితే సినిమాలు హిట్ అవ్వడంతో ఆమెతో సినిమాలు చెయ్యడానికి నిర్మాతలు క్యూ కట్టేవారు.. ఇకపోతే ఈ అమ్మడు ఈ మధ్య సినిమాలను తగ్గించిందని అందరికి తెలుసు..ఆమె పెళ్లి ఒక కారణం కావొచ్చు..గత ఏడాది పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. తమిళ్ దర్శకుడు విగ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లాడింది ఈ ముద్దుగుమ్మ. ఇక నయనతార క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు..
తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు నయనతార.హీరోలకు ఏమాత్రం తగ్గకుండా తన నటనతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు నయన్. పెళ్లి తర్వాత ల విషయాంలో ఆచితూచి అడుగులేస్తోంది నయన్. రీసెంట్ గానే కనెక్ట్ అనే చేసింది. ఇటీవలే నయన్ , విగ్నేష్ లు కవల పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు. ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది నయన్..భర్త పిల్లలతో కలిసి విదేశాల్లో ఉన్నారు..అక్కడ ప్రతి లొకేషన్ ను ఫోటోలు తీసి అభిమానులకు షేర్ చేస్తుంది..అవి వైరల్ అవుతున్నాయి..
ఇది ఇలా ఉండగా..ఈ దంపతులు కొత్త ఏడాది సందర్భంగా రోడ్డు పక్కన ఉండే పిల్లలకు గిఫ్ట్ లు పంచి పెట్టారు. దంపతులు ఇద్దరు కలిసి ఆ గిఫ్ట్ లను పేద పిల్లలకు పంచారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నయన్ తన భర్త తో కలిసి ఇలా రోడ్డు పక్కన నివాసం ఉండే పేద పిల్లలకు గిఫ్ట్ లు పంచిపెట్టారు.నయన్ దంపతులు చేసిన ఈ పనికి సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. శబాష్ అంటూ మెచ్చుకుంటున్నారు. మొత్తానికి ఈ అమ్మడు మరోసారి వార్తల్లో నిలిచింది..