Tamannah భాటియా.. ఒకప్పుడు టాలీవుడ్ ను ఒక ఊపు ఊపేసిన హీరోయిన్. అగ్రహీరోల నుంచి యంగ్ హీరోల వరకు ఈ బ్యూటీ రొమాన్స్ చేయని వారంటూ లేరు. సూపర్ హిట్స్, బంపర్ హిట్స్, బ్లాక్ బస్టర్ హిట్స్ తో ఈ భామ సినీ కెరీర్ గ్రాఫ్ ఆకాశానికి ఎగిసింది. కానీ కొంతకాలంగా ఈ బ్యూటీకి టాలీవుడ్ లో అవకాశాలు కరవయ్యాయి.
అడపాదడపా ఆఫర్లతో టాలీవుడ్ లో అప్పుడప్పుడు కనిపిస్తోంది తమన్నా. ఇక్కడ ఆఫర్లు రాకపోవడంతో ఈ బ్యూటీ తన మకాం ముంబయికి మార్చింది. గతంలో ఒకటీ రెండు హిందీ సినిమాలు చేసినా అంతగా సక్సెక్ రాలేదు ఈ బ్యూటీకి. అయినా ఈ భామకు ముంబయిపై ప్రేమ తగ్గలేదు. రీసెంట్ గా బబ్లీ బౌన్సర్, ప్లాన్ ఏ ప్లాన్ బీ మూవీస్ తో హిట్ కొట్టింది.
మూడు పదుల వయసు దాటుతున్నా ఈ భామ ఇప్పటికీ పెళ్లి మాట ఎత్తడం లేదు. ఇప్పటికీ తమన్నా ప్రేమ, పెళ్లి జోలికి వెళ్లలేదు. 2023లో మాత్రం తమన్నా పెళ్లి చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ సందర్భంగా తమన్నా ప్రేమ వ్యవహారం బయటపడింది. ప్రస్తుతం సోషల్ మీడియా అంతా తమన్నా ప్రేమాయణం ముచ్చట్లే.
తమన్నా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం గోవా వెళ్లింది. అక్కడ న్యూ ఇయర్ వేడుకల్లో మెరిసిన ఈ మిల్కీ బ్యూటీ అందరూ పార్టీ మూడ్ లో ఉండగా ఓ వ్యక్తిని కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంది. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాకెక్కి తెగ వైరల్ అవుతోంది. ట్యామీ కిస్ చేసిన వ్యక్తి ఎవరు అని ఆరా తీయగా అతను టాలీవుడ్ విలన్ విజయ్ వర్మ అని తెలిసింది.
తమన్నా-విజయ్ వర్మ గత కొంతకాలంగా ముంబయి వీధుల్లో చెట్టాపట్టాలేసుకుని తిరిగినట్లు తెలుస్తోంది. వీళ్లిద్దరు ఘాటైన ప్రేమలో మునిగితేలుతున్నట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది. విజయ్- తమన్నా ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నారట. ఈ ఇద్దరి రిలేషన్ షిప్ రూమర్స్ సోషల్ మీడియాకు ఎక్కడంతో ఒక్కసారిగా వీరి పాత ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
అసలు ఈ ఇద్దరి రిలేషన్ ఎలా షురూ అయిందని ఆరా తీయగా తెలిసిన విషయం ఏంటంటే.. ఈ ఇద్దరు బాలీవుడ్ లో ఓ ప్రాజెక్టులో కలిసి నటిస్తున్నారట. లస్ట్ స్టోరీస్ -2 కోసం కలిసి నటిస్తున్న తమన్నా -విజయ్ వర్మలు ఆ సిరీస్ షూటింగ్ లో ఉండగానే ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. ఈ న్యూ ఇయర్ కు అందరు జంటల్లాగే ఈ జంట కూడా గోవాకు వెళ్లిందట. గోవాలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో ఉన్నప్పుడు ఈ జంట క్లోజ్ గా ఉన్న వీడియో వైరల్ కావడంతో అసలు సంగతి బయటపడింది. అయితే వీరి రిలేషన్ షిప్ రూమర్స్ పై ఇప్పటికీ ఈ జంట క్లారిటీ ఇవ్వలేదు.