Bro Movie : ‘వకీల్ సాబ్’ మరియు ‘భీమ్లా నాయక్ ‘ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘బ్రో ది అవతార్’ చిత్రం ఈ ఏడాది విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ టాక్ ని తెచ్చుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ కూడా ఈ సినిమా పది రోజుల వరకు డీసెంట్ స్థాయి వసూళ్లను రాబట్టింది.

ఈమధ్య కాలం లో ఫ్లాప్ టాక్ వస్తే రెండవ రోజు నుండి కనీస స్థాయి వసూళ్లను కూడా రాబట్టలేకపోతున్నాయి. అలాంటి ఈ రోజుల్లో పవన్ కళ్యాణ్ ‘బ్రో ది అవతార్’ లాంటి నాన్ కమర్షియల్ ఆఫ్ బీట్ సినిమాకి టాక్ తో సంబంధం లేకుండా 70 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాడు అంటే ఆయన స్టార్ స్టేటస్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఓటీటీ స్ట్రీమింగ్ లో కూడా మంచి రెస్పాన్స్ ని దక్కించుకున్న ఈ చిత్రం నిన్న జీ తెలుగు లో టెలికాస్ట్ అయ్యింది.

ఈ టెలికాస్ట్ కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టీవీ టెలికాస్ట్ కి భారీ కటౌట్, పూల దండ, కేక్ కట్టింగ్స్ చేసి అభిమానులు సంబరాలు చేసారు. దీనికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో వైరల్ అయ్యాయి. టీఆర్ఫీ రేటింగ్స్ కూడా ఊహించిన దానికంటే ఎక్కువ వచ్చినట్టు సమాచారం. చాలా కాలం తర్వాత జీ తెలుగు ఛానల్ కి నిన్న మిలియన్ల కొద్దీ యూజర్లు ట్యూన్ అయ్యారట.

వారి అంచనాల ప్రకారం ఈ చిత్రానికి మొదటి టెలికాస్ట్ లో దాదాపుగా 14 నుండి 15 వరకు టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే ఛానల్ లో గతం లో పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘వకీల్ సాబ్’ చిత్రం టెలికాస్ట్ అయ్యింది. ఈ సినిమాకి దాదాపుగా 20 టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చాయి. ఆ సినిమా సూపర్ హిట్ కాబట్టి అంత రావడం లో ఆశ్చర్యం లేదు, కానీ ఒక ఫ్లాప్ సినిమాకి ఈ రేంజ్ రేటింగ్స్ మాత్రం కేవలం పవర్ స్టార్ సినిమాలకు మాత్రమే జరుగుతాయని అంటున్నారు ఫ్యాన్స్.