Ustad Bhagat Singh లో రేణు దేశాయ్.. ఎలాంటి పాత్రలో కనిపించబోతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

- Advertisement -

Ustad Bhagat Singh : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్న చిత్రాలలో ఒకటి ‘ఉస్తాద్ భగత్ సింగ్’. గబ్బర్ సింగ్ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో చేస్తున్న చిత్రం ఇది. ఎప్పుడు ప్రారంభం అవ్వాల్సిన ఈ సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చి, ఎట్టకేలకు రీసెంట్ గానే షూటింగ్ ని ప్రారంభించుకుంది.

Ustad Bhagat Singh
Ustad Bhagat Singh

ఇప్పటి వరకు మూడు షెడ్యూల్స్ ని పూర్తి చేసారు. మొదటి షెడ్యూల్ పూర్తి అవ్వగానే హరీష్ శంకర్ అభిమానుల కోసం ఒక చిన్న టీజర్ కట్ ని వదిలాడు. దీనికి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తక్కువ రోజులు షూటింగ్ చేసి ఇంత గొప్ప ఔట్పుట్ ఎలా ఇచ్చావు అంటూ పొగడ్తలతో ముంచి ఎత్తారు ఫ్యాన్స్. ఇకపోతే ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

Pawan Kalyan Sreeleela

అయితే ఈ చిత్రం లో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఒక ముఖ్యమైన లేడీ క్యారక్టర్ కోసం డైరెక్టర్ హరీష్ శంకర్ చాలా మందిని అనుకున్నాడు. కానీ అందరికంటే రేణు దేశాయ్ ఆ పాత్ర కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని ఆమెని రీసెంట్ గా సంప్రదించాడట. రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ కి మాజీ భార్య అనే సంగతి మన అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరు విడిపోయినప్పటికీ ఇప్పటికీ స్నేహం గానే ఉంటున్నారు.

- Advertisement -
Pawan Kalyan

పవన్ కళ్యాణ్ గురించి రేణు దేశాయ్ ఇప్పటికీ ఎంతో గొప్పగా మాట్లాడుతుంది. మంచి స్నేహంగా ఉన్నారు కాబట్టే రేణు దేశాయ్ ని ఈ పాత్ర చెయ్యమని అడగడానికి వెళ్ళాడట డైరెక్టర్ హరీష్ శంకర్. ఆమె ఆలోచించుకొని చెప్తాను అని హరీష్ శంకర్ కి చెప్పిందట. ఒకవేళ ఓకే చెప్తే మాత్రం సినిమా మీద హైప్ మరింత పెరిగే అవకాశం ఉంది. రేణు దేశాయ్ రీసెంట్ గా రవితేజ హీరో గా నటించిన ‘టైగర్ నాగేశ్వర రావు’ చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇక నుండి ఆమె రెగ్యులర్ గా సినిమాలు చేస్తుందట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here