Ravi Teja : ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరో రేంజ్ కు ఎదిగారు రవితేజ. హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు తీస్తూ చిత్ర పరిశ్రమలోని వారికి చేతినిండా పని కల్పిస్తుంటారు ఆయన. నాలుగు ఫ్లాపులు పడ్డా ఒక్క హిట్ తో కమ్ బ్యాక్ కావడం రవితేజ స్టైల్ అండ్ స్టామినా. ప్రస్తుతం డైరెక్టర్ వంశీ తెరకెక్కిస్తున్న అవుట్ అండ్ అవుట్ యాక్షన్ చిత్రం టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ భామలు నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ చాలా సంవత్సరాల తర్వాత వెండితెరపై మెరవనున్నారు. వీరితో పాటు మురళీ శర్మ, అనుపమ్ కేర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇప్పటి వరకు టైగర్ నాగేశ్వరరావు సినిమా నుంచి విడుదలైన ప్రతి అప్డేట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో ఎలాగైనా రవితేజ ఈసారి కచ్చితంగా పాన్ ఇండియా హీరో అనిపించుకుంటారని ఆయన ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే రవితేజ ఎక్కువగా బాలీవుడ్ పై ఫోకస్ పెడుతూ అక్కడ ఎక్కువ మొత్తంలో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రవితేజ తన జీవితంలో బయోపిక్ చేయవలసి వస్తే.. అని ప్రశ్న అడగ్గా అందుకు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.

ఒకవేళ నా బయోపిక్ తీయాల్సి వస్తే ఖచ్చితంగా ఫుల్ లెన్త్ ఎంటర్టైన్మెంట్ జానర్లోనే ఉంటుంది. నా బయోపిక్ లో నేనే నటిస్తానని చెప్పారు. బయోపిక్ టైటిల్ ఏంటని అడగ్గా.. అక్కడున్న కొంతమంది మాస్ మహారాజా అంటూ పిలవడం జరిగింది. రవితేజ కూడా తన బయోపిక్ తీస్తే అదే టైటిల్ సెట్ చేస్తానంటూ తెలిపారు. దీంతో రవితేజ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన తన కెరీర్లో మొదట జూనియర్ ఆర్టిస్టుగా, అసిస్టెంట్ డైరెక్టర్ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పనిచేసి హీరో మారి పాన్ ఇండియా స్టార్ రేంజ్ కు ఎదిగారు.