Taapsee Pannu : ప్రభాస్ – రవితేజ అలాంటి పనులకు పనికిరారు అంటూ హీరోయిన్ తాప్సి హాట్ కామెంట్స్..!

- Advertisement -

Taapsee Pannu : కేవలం ఒకటి రెండు సినిమాలతోనే కోట్లాది మంది తెలుగు ఆడియన్స్ మెప్పు పొందడం అనేది సాధారణమైన విషయం కాదు. అలాంటి హీరోలు కానీ హీరోయిన్స్ కానీ చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి హీరోయిన్స్ లో ఒకరే తాప్సి. ఈమె దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ‘ఝుమ్మంది నాథం’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. ఈ సినిమా పెద్ద కమర్షియల్ హిట్ అవ్వడం తో ఈమెకి అవకాశాలు క్యూ కట్టాయి.

Taapsee Pannu
Taapsee Pannu

అలా టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న తర్వాత ఈ అమ్మాయి బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. టాలీవుడ్ కంటే ఎక్కువగా ఈమె బాలీవుడ్ లోనే ఎక్కువ పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. అక్కడ లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో కూడా సూపర్ హిట్స్ అందుకుంది. అయితే రీసెంట్ గా ఈ హాట్ బ్యూటీ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.

Taapsee Pannu Photos

ఆమె మాట్లాడుతూ తెలుగు లో కమర్షియల్ హీరోల పక్కన నటించే ఛాన్స్ వస్తే అసలు వదులుకోను. ఎలాంటి పాత్ర చేయడానికైనా నేను రెడీ, కానీ కమర్షియల్ చిత్రాల్లో నాకు ఇప్పటి వరకు టాలీవుడ్ లో అవకాశాలు రాలేదు అని చెప్పుకొచ్చింది. టాలీవుడ్ లో ఈమె ఇప్పటి వరకు రవితేజ మరియు ప్రభాస్ వంటి స్టార్ హీరోల పక్కన హీరోయిన్ గా నటించింది.

- Advertisement -
Prabhas ravi teja

రవితేజ తో ‘వీర’ మరియు ‘దరువు’ సినిమాలు చెయ్యగా, ప్రభాస్ తో ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమా చేసింది. ఈ సినిమాలన్నీ కమర్షియల్ గా బాగా ఆడాయి. కానీ తెలుగు లో ఇప్పటి వరకు స్టార్ హీరోల పక్కన నటించలేదు అని అంటుంది. అంటే తాప్సి దృష్టిలో రవితేజ, ప్రభాస్ స్టార్ హీరోలు కాదా?, వాళ్ళు కమర్షియల్ హీరోలుగా పనికిరారా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ తాప్సి కామెంట్స్ పై విరుచుకుపడుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here