Ram Charan ని ‘బద్మాష్’ అంటూ బూతులు తిట్టిన క్రేజీ హీరోయిన్..వైరల్ అవుతున్న వీడియో!

- Advertisement -

Ram Charan : చిరంజీవి కొడుకుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ నేడు చిరంజీవిని మించిపోయే రేంజ్ స్టార్ స్టేటస్ ని దక్కించుకున్నాడు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎంత ఎత్తుకి ఎదిగినా,ఇసుమంత గర్వం కూడా లేని రామ్ చరణ్ తన తోటి స్టార్ హీరోలతో, తోటి నటులతో ఎంత సన్నిహితంగా ఉంటాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. ప్రతీ ఒక్కరితో ఆయన ఎంతో స్నేహంగా ఉంటాడు.

Ram Charan
Ram Charan

కేవలం హీరోలతో మాత్రమే కాదు, హీరోయిన్స్ తో కూడా రామ్ చరణ్ ఎంతో సాన్నిహిత్యం మైంటైన్ చేస్తూ వచ్చాడు. కాజల్ అగర్వాల్, తమన్నా, నేహా శెట్టి , రకుల్ ప్రీత్ సింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దది వస్తుంది. అంత మందితో స్నేహం గా ఉంటాడు ఆయన. రీసెంట్ గా అయితే కియారా అద్వానీ తో ఎక్కువగా సన్నిహితంగా ఉంటున్నాడు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో గతం లో ‘వినయ విధేయ రామ’ సినిమా వచ్చింది.

ఇప్పుడు మళ్ళీ వీళ్ళ కాంబినేషన్ లో ‘గేమ్ చేంజర్’ అనే చిత్రం వస్తుంది. సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే వీళ్ళ మధ్య ఉన్న కెమిస్ట్రీ ని ఒక్కసారి గుర్తు చేసుకుంటూ అభిమానులు సోషల్ మీడియా లో వీళ్లకు సంబంధించిన పాత వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు.

- Advertisement -

అలా రామ్ చరణ్ మరియు కియారా అద్వానీ రానా హుసైట్ గా వ్యవహరించిన ‘నెంబర్ 1 యారి విత్ రానా’ ప్రోగ్రాం కి వచ్చారు. ఈ ప్రోగ్రాం లో రామ్ చరణ్ కియారా అద్వానీ ని ఆటపట్టిస్తాడు. ఎవరైనా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి వచ్చినప్పుడు ఎలా మాట్లాడుతారు రా, హాయ్ హలో అని అంటారు, కానీ ఈమె మాత్రం సభకు నమస్కారం అంటూ మాట్లాడింది, అని అంటాడు. అప్పుడు కియారా అద్వానీ నువ్వే కదా అలా మాట్లాడాలి అని చెప్పావ్ అని అంటూ, బద్మాష్ అని నవ్వుతు తిడుతుంది. ఈ వీడియో చాలా కాలం తర్వాత ఇప్పుడు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది.

https://www.youtube.com/watch?v=ob-lPr6rSqg
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here