Shanmukh Jaswanth : సోషల్ మీడియా వృద్ధిలోకి వచ్చిన తర్వాత షార్ట్ ఫిలిమ్స్ మరియు వెబ్ సిరీస్ లు విపరీతంగా పెరిగిపోయిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పాపులారిటీ ని దక్కించుకొని నేడు వైష్ణవి చైతన్య అనే అమ్మాయి పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక సుజిత్ అయితే ఏకంగా పవన్ కళ్యాణ్ , ప్రభాస్ వంటి హీరోలతో భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాలు తీసే స్థాయికి ఎదిగాడు.
వాళ్ళ రేంజ్ లో కాకపోయినా, ఇప్పుడు ఉన్న యూట్యూబర్స్ లో అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న నటుడు షణ్ముఖ్ జస్వంత్. వైవా అనే షార్ట్ ఫిలిం ద్వారా పరిచయమైనా ఇతను, ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ లో నటించాడు. అంతే కాదు కవర్ సాంగ్స్ కూడా ఎన్నో చేసాడు. ఇతని డ్యాన్స్ కి మంచి క్రేజ్ ఉంది. అలా చిన్నగా డెవలప్ అవుతూ వస్తున్న షణ్ముఖ్ ‘సాఫ్ట్ వేర్ డెవలపర్’ అనే వెబ్ సిరీస్ తో స్టార్ స్టేటస్ ని దక్కించుకున్నాడు.
వెబ్ సిరీస్ క్యాటగిరీ లో ఈ సిరీస్ ఒక మినీ బాహుబలి రేంజ్ రికార్డ్స్ ని సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు ఈ వెబ్ సిరీస్ కి వచ్చినన్ని వ్యూస్ ఏ సిరీస్ కి కూడా రాలేదు. ఈ సిరీస్ తర్వాత ఆయన చేసిన ‘సూర్య’ అనే వెబ్ సిరీస్ కూడా పెద్ద హిట్ అయ్యింది. ఇలా బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ రావడం తో సూర్య కి సోషల్ మీడియా లో ఉండే యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ పెరిగింది. అలా వచ్చిన ఫేమ్ తోనే ఆయన ‘బిగ్ బాస్‘ సీజన్ 5 లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొనే ఛాన్స్ కొట్టేసాడు.
పెద్దగా గేమ్ ఆడకపోయినా కూడా టాప్ 2 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచాడు అంటే అందుకు కారణం అతనికి ఉన్న ఫాలోయింగ్ అని అంటుంటారు విశ్లేషకులు. ఇప్పుడు ఆయన రీసెంట్ గా ‘స్టూడెంట్’ అనే వెబ్ సిరీస్ తో మన ముందుకు వచ్చాడు, ఇది కూడా మంచి విజయం సాధించింది. ఇలా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ మూడు వెబ్ సిరీస్ కి కలిపి దాదాపుగా 20 కోట్ల రూపాయిలు ఆదాయం వచ్చినట్టుగా తెలుస్తుంది. అంతే కాకుండా నెలకి ఇన్ఫినిటీ మీడియం కంపెనీ వారు షణ్ముఖ్ కి 5 లక్షల రూపాయిలు పారితోషికంగా ఇస్తారట.