Bigg Boss : గడిచిన అన్నీ బిగ్ బాస్ సీజన్స్ కంటే ఈ సీజన్ ఎంతో రసవత్తరంగా సాగుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఆరవ సీజన్ అతి పెద్ద ఫ్లాప్ అవ్వడం తో 7 వ సీజన్ పై అంచనాలు చాలా తక్కువ గా ఉండేవి. కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ మొదటి ఎపిసోడ్ నుండే అద్భుతమైన ఆట తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది.
ఇక ప్రతీవారం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూసే నామినేషన్స్ ప్రక్రియ ఈ వారం ఎంత వాడావేడి వాతావరణం మధ్య జరిగిందో అందరూ చూసారు. యావర్, రతికా, ప్రియాంక, గౌతమ్, టేస్టీ తేజా మరియు శుభ శ్రీ ఇంటి నుండి బయటకి వెళ్ళడానికి నామినేట్ అయ్యారు. వీరిలో ముందుగా టేస్టీ తేజా ఎలిమినేట్ అవుతారని అందరూ అనుకున్నారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా రతికా అందరి కంటే తక్కువ ఓట్లతో డేంజర్ జోన్ లో ఉంది.
ఈ వారం 100 కి 99 శాతం రతికా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది అంటున్నారు. కాబట్టి రతికా తర్వాత తక్కువ ఓట్లు దక్కించుకున్న కంటెస్టెంట్ గా టేస్టీ తేజా నిల్చినట్టు తెలుస్తుంది. డబుల్ ఎలిమినేషన్ పెడితే వీళ్లిద్దరు ఇంటి నుండి వెళ్ళిపోతారు. కానీ ఏది మనం అనుకున్నట్టు బిగ్ బాస్ చెయ్యడు. ఎందుకంటే ఇది ‘ఉల్టా పల్టా’ సీజన్ కాబట్టి. అందుతున్న సమాచారం ప్రకారం యావర్ ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వబోతున్న రెండవ కంటెస్టెంట్ అని తెలుస్తుంది.
ప్రస్తుతం ఉన్న నామినేషన్స్ లో అందరికంటే ఎక్కువ ఓట్లు నమోదు చేసుకున్న యావర్ ఎలిమినేట్ అవ్వడం ఏమిటి అని అనుకుంటున్నారా?, ఇక్కడే అసలు ట్విస్ట్. యావర్ ని ఎలిమినేట్ చేసినట్టుగా హౌస్ మేట్స్ ని నమ్మించి, సీక్రెట్ రూమ్ లోకి పంపబోతున్నారని తెలుస్తుంది. యావర్ కి ఇంట్లో అందరికంటే ఎక్కువగా గొడవలు ఉన్నాయి, అలాగే స్నేహాలు కూడా ఉన్నాయి. అలాంటి కంటెస్టెంట్ ని సీక్రెట్ రూమ్ లోకి పంపిస్తే ఎవరు యావర్ కి నిజమైన స్నేహితులు, ఎవరు నిజమైన శత్రువులు అనేది తెలుస్తుంది. అప్పుడు చూసే ఆడియన్స్ కి కూడా ఆట ఆసక్తికరంగా అనిపిస్తాది, అందుకే యావర్ ని సీక్రెట్ రూమ్ కి పంపబోతున్నారని టాక్.