Subha Sri : ఇండియా లోనే బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఆరు సీజన్స్ ని పూర్తి చేసుకొని రీసెంట్ గానే 7 వ సీజన్ లోకి అడుగుపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ 7 వ సీజన్స్ ఇప్పటికే మూడు వారలను పూర్తి చేసుకొని ఇప్పుడు నాల్గవ వారం లోకి అడుగుపెట్టింది. మొదటి ఎపిసోడ్ నుండి నేటి వరకు ప్రతీ ఎపిసోడ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ఈ సీజన్ లో, సోషల్ మీడియా ద్వారా అత్యంత పాపులారిటీ ని దక్కించుకున్న కంటెస్టెంట్ గా శుభ శ్రీ నిలిచారు.
ఈమెకి కుర్రాళ్లలో ఉన్న క్రేజ్ మామూలుది కాదు. లుక్స్ పరంగా మాత్రమే కాకుండా, హౌస్ లో అందరితో క్యూట్ గా మాట్లాడుతూ ఎలాంటి ఓవర్ యాక్షన్ లేకుండా ప్రవర్తిస్తున్న ఆ తీరుని ప్రతీ ఒక్కరు మెచ్చుకుంటున్నారు. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టకముందు ఆమె పలు సినిమాల్లో నటించింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘ఓజీ’ లో కూడా శుభ శ్రీ ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది. ఈ విషయాన్నీ స్వయంగా ఆమెనే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టక ముందు ఒక ఇంటర్వ్యూ లో చెప్పింది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే శుభశ్రీ తల్లిదండ్రులు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, ఈ ఇంటర్వ్యూ లో శుభశ్రీ గురించి ఎన్నో విషయాలు తెలిపారు.
లా చదివి ఉన్నత స్థాయిలో వెళ్తుంది అనుకున్నాము, కానీ మా అమ్మాయికి సినిమాల మీద ఆసక్తి, మా ఆయన ఎందుకు ఇప్పుడు ఇవన్నీ అని భయపడ్డాడు, కానీ నేను ప్రోత్సహించి పంపించాను, సినిమా ఇండస్ట్రీ లో అవకాశాలు అందరికీ రావు, అదొక అదృష్టం, చదువుకొని ఉద్యోగం చేసి ఉంటే మా పాప నలుగురిలో ఒకరిగా మిగిలిపోయేది, కానీ ఇప్పుడు అందరికంటే స్పెషల్ అని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి రాగానే అమ్మాయికి పెళ్లి చేసేస్తాం అని, సాఫ్ట్ వేర్ రంగానికి చెందిన ఒక అబ్బాయిని చూశామని, ఎప్పటి నుండో శుభశ్రీ కూడా అతనితో మాట్లాడుతుంది అని, ఇద్దరు ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు అంటూ చెప్పుకొచ్చారు. మరి శుభశ్రీ పెళ్లి చేసుకోబోతున్న ఆ అబ్బాయి ఎవరు ఏమిటి అనే దానిపై ఇప్పుడు సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఆరాలు తీస్తున్నారు.