పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు దేశమంతటా కాదు ప్రపంచమంతటా ఉన్నారు. అది ప్రభాస్ రేంజ్. బాహుబలి సినిమాతో మొట్టమొదటి పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరో ప్రభాస్. ఇక ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న డార్లింగ్ కటౌట్ ఎక్కడ కనిపించినా.. అభిమానులు దండాలు పెట్టడమే.. ఇప్పటికే ఆయన ఖ్యాతి ప్రపంచనలుమూలలా వ్యాపించింది.
మేడమ్ టుస్సాడ్స్ మైనపు విగ్రహాల మ్యూజియంలో కూడా ప్రభాస్ మైనపు విగ్రహం పెట్టి.. ఆయనను గౌరవించారు. ఇక డార్లింగ్ ఫ్యాన్స్.. ప్రభాస్ కటౌట్ ను పుట్టినరోజులు, సినిమా రిలీజ్ లకు పెడుతూ ఉంటారు. అయితే గత వారం రోజుల క్రితం మైసూర్ వాక్స్ మ్యూజియంలో ప్రభాస్ మైనపు విగ్రహాన్ని తయారుచేసినట్లు ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. అయితే ఆ విగ్రహం చూస్తే .. అసలు ప్రభాస్ లానే కనిపించలేదు.
బాహుబలిలోని అమరేంద్ర బాహుబలి పోజ్ లో ఉన్న ఆ విగ్రహం చూసిన ఎవ్వరు కూడా అది ప్రభాస్ అని చెప్పలేరు. ఇక ఈ మైనపు విగ్రహం తయారుపై బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ ఫైర్ అయ్యాడు. అది ప్రభాస్ విగ్రహం కాదని, వెంటనే తొలగించాలని డిమాండ్ చేశాడు. అంతేకాకుండా తొలగించకపోతే చర్యలు తప్పవని కూడా తెలిపాడు. “ఇది అధికారికంగా లైసెన్స్ పొందిన పని కాదు.. మరియు మా అనుమతి తీసుకోకుండా.. మాకు తెలియకుండా జరిగింది. దీన్ని తొలగించేందుకు వెంటనే చర్యలు తీసుకుంటాం” అంటూ ట్వీట్ చేసాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.