‘Bharateeyudu’ సినిమాని తెలుగు లో ఆ హీరోతో రీమేక్ చేసేందుకు ఇన్ని ప్రయత్నాలు చేసారా..!

- Advertisement -

Bharateeyudu : పాన్ ఇండియన్ , పాన్ వరల్డ్ సినిమాలు ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ అయ్యుండొచ్చు. కానీ మనం పుట్టకముందు నుండే పాన్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న దిగ్గజం శంకర్. ఈయన దర్శకత్వం లో వచ్చిన సినిమాలన్నీ అప్పట్లో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసాయి. అసలు ఆరోజుల్లో ఇలాంటి ఆలోచనలు ఎలా చేయగలిగాడు అని ప్రతీ ఒక్కరు ఆశ్చర్యపోక తప్పదు. ఆ స్థాయిలో ఉంటుంది శంకర్ టేకింగ్ మరియు దర్శకత్వం.

Bharateeyudu
Bharateeyudu

అందుకే ఎంత మంది రాజమౌళిలు, ఎంత మంది ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్స్ వచ్చినా, శంకర్ బ్రాండ్ కి ఉన్న విలువే వేరు. అలాంటి శంకర్ కెరీర్ లో ఆణిముత్యం లాంటి సినిమా ‘భారతీయుడు’. కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్ ని షేక్ చేసింది. ఒక్క తమిళం లో మాత్రమే కాదు, హిందీ మరియు తెలుగు భాషల్లో కూడా ఈ సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్.

Kamal Haasan

అయితే ఈ చిత్రాన్ని శంకర్ అప్పట్లో ద్విభాషా చిత్రం గా చేద్దాం అనుకున్నాడు. తమిళం లో కమల్ హాసన్ తో, అలాగే తెలుగు లో మెగాస్టార్ చిరంజీవి తో చెయ్యాలని అనుకున్నాడు. చిరంజీవి ని కలిసి స్టోరీ కూడా వినిపించాడు. అయితే మీ పాత్ర ఇలా ఉండబోతుంది అని కమల్ హాసన్ తో తీసిన కొన్ని సన్నివేశాలను చిరు కి చూపించాడట. అవి చూసిన చిరంజీవికి మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యింది.

- Advertisement -
Chiranjeevi kamal haasan

ఈ స్థాయి నటన ని నేను మ్యాచ్ చేయలేనని, నేను ఎంత బాగా చేసిన కమల్ హాసన్ నటన తో పోలిస్తే తక్కువే ఉంటుంది అని నా మనసుకి అనిపిస్తుందని, సంతృప్తి తో ఈ చిత్రాన్ని చెయ్యలేను, వేరే వాళ్ళతో కూడా ఈ క్యారక్టర్ చేయించాలని అనుకోకండి, ఇది కమల్ హాసన్ గారి కోసమే పుట్టినట్టు అనిపిస్తున్న పాత్ర. తెలుగు లో కూడా మీరే దబ్ చేయించి విడుదల చెయ్యండి, కచ్చితంగా సక్సెస్ అవుతుంది అని చెప్పాడట చిరంజీవి. ఆయన చెప్పినట్టుగానే తెలుగు లో దబ్ చేసి ఈ చిత్రాన్ని విడుదల చేశారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here