Nagarjuna చిరంజీవికి మధ్య చెడిందట.. ఏం మనుషులు రా బాబు..

- Advertisement -

Nagarjuna : టాలీవుడ్లో మెగా ఫ్యామిలీ, అక్కినేని కుటుంబాలకు మధ్య ఎంత సాన్నిహిత్యం ఉందో అందరికీ తెలిసిందే. దాదాపు ఇద్దరి స్టార్ డమ్ ఒకే రేంజ్ లో ఉన్నప్పటికీ నాగార్జున చిరంజీవిని అన్నయ్య అని సంబోధిస్తుంటారు. చిరు కూడా నాగార్జునను తన తమ్ముడనే చాలా వేదికలపై చెప్పిన సందర్భాలున్నాయి. నాగ్ ఇంట్లో ఏ విశేషమైనా.. అలాగే చిరంజీవి ఇంట్లో చిన్న ఫంక్షన్ జరిగినా ఒకరి ఇంటికి ఒకరు తప్పకుండా వచ్చిపోతుంటారు. కానీ ఇటీవల ఏఎన్నార్ శత జయంతి వేడుకకు చిరు రాకపోవడం కొంత సందేహాలకు తావిచ్చినట్లైంది. ఈ క్రమంలోనే మరో సారి చిరంజీవి పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.

Nagarjuna
Nagarjuna

వాస్తవానికి టాలీవుడ్ కు పెద్ద దిక్కు కావడమో ఏమో తెలియదు కానీ ఈ మధ్య చిరంజీవిని సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ట్రోలింగ్ చేస్తున్నారు. ప్రతి విషయంలోనూ ఆయన ట్వీట్ చేసిన.. ట్వీట్ చేయకపోయినా.. ఫంక్షన్ కి వెళ్లినా.. వెళ్లకపోయినా.. ఆయన పరిస్థితి ఏంటో తెలియకుండా ఆయనదే తప్పు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు కొందరు. ఈ క్రమంలోనే రీసెంట్ గా ఏఎన్నార్ శత జయంతి వేడుకలకు అందుకే చిరంజీవి రాలేదని కొందరు ఆయనను వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఎన్టీఆర్, ఏఎన్నార్ అంటే చిరంజీవి అమిత గౌరవం. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఏఎన్నార్ శత జయంతి వేడుకలకు రాకపోవడానికి పర్సనల్ రీజన్ ఉంది. చిరంజీవి హెల్త్ కండిషన్ బాగోలేదు. తన మోకాళ్లకు సర్జరీ జరిగింది. డాక్టర్ పూర్తి బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారు. అందుకే ఇటీవల ఏ ఫంక్షన్స్ కు రావడం లేదు. ఇటీవల జరిగిన బ్రహ్మానందం రెండో కొడుకు పెళ్లికి కూడా వెళ్లలేదు. ఇవేవీ పట్టించుకోకుండా ట్రోల్ చేయడం సరికాదంటూ మెగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here