పవన్ కళ్యాణ్ కి తల్లిగా కమల్ హాసన్ భార్య.. హరీష్ శంకర్ ప్లానింగ్ మాములుగా లేదుగా!

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హీరో గా నటిస్తున్న సినిమాలలో అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్న చిత్రాలలో ఒకటి ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమా పవన్ కళ్యాణ్ నుండి చాలా కాలం తర్వాత వస్తున్న పర్ఫెక్ట్ కమర్షియల్ చిత్రం. రీ ఎంట్రీ తర్వాత పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాలన్నీ ఆఫ్ బీట్ సినిమాలే, వకీల్ సాబ్, భీమ్లా నాయక్ మరియు రీసెంట్ గా విడుదలైన ‘బ్రో ది అవతార్’, వీటి అన్నిట్లో కమర్షియల్ ఎలిమెంట్స్ చాలా తక్కువ.

పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్

ఆయన నుండి అభిమానులు ‘గబ్బర్ సింగ్’ రేంజ్ పర్ఫెక్ట్ మాస్ సినిమాని కోరుకుంటున్నారు. సరిగ్గా గబ్బర్ సింగ్ కి దర్శకత్వం వహించిన హరీష్ శంకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతుండడం తో అంచనాలు మామూలు రేంజ్ క్రియేట్ అవ్వలేదు. దానికి తోడు రీసెంట్ గా విడుదల చేసిన టీజర్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఇకపోతే ఈ సినిమాలో శ్రీలీల మరియు సాక్షి వైద్య హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ తల్లిగా కమల్ హాసన్ మాజీ సతీమణి గౌతమీ నటిస్తుందట. ప్రస్తుతం గండిపేట లో వేసిన దేవాలయం సెట్ లో ఒక భారీ ఫైట్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అంటే హరీష్ శంకర్ కి పూనకాలు వచ్చేస్తాయి అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి కూడా తన నుండి ది బెస్ట్ ఔట్పుట్ ఇచ్చేందుకు అనుక్షణం తాపత్రయం పడుతున్నాడు.

- Advertisement -

సినిమా కోసం ఆయన సుమారుగా మూడేళ్ళ పాటు నిరీక్షించాడు. చివరికి ఆ నిరీక్షణకు తెరపడి షూటింగ్ ముందుకు సాగుతుంది. 20 వ తారీఖు వరకు సాగనున్న ఈ సినిమా షూటింగ్, మళ్ళీ అక్టోబర్ నుండి నాన్ స్టాప్ గా మరో షెడ్యూల్ జరగబోతుంది. ఎలా అయినా ఈ ఏడాది లోనే షూటింగ్ పూర్తి చేసి సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here