#RRR వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తో పాన్ వరల్డ్ రేంజ్ లో స్టార్ స్టేటస్ ని దక్కించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఇప్పుడు కొరటాల శివ తో ‘దేవర’ అనే చిత్రం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఆలస్యం గా ప్రారంభమైన అప్పుడే 5 షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుంది. ఆచార్య సినిమా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడం తో , ఈ సినిమాతో ఎలా అయినా తన దర్శకత్వ ప్రతిభ చూపించి ఇండస్ట్రీ రికార్డ్స్ ని బద్దలు కొట్టాలనే కసితో ఉన్నాడు డైరెక్టర్ కొరటాల శివ.
అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాని రిచ్ గా ఎక్కడా తగ్గకుండా తీస్తున్నాడు. కొన్ని అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలను తియ్యడం కోసం ఆయన ఏకంగా హాలీవుడ్ టెక్నీషియన్స్ పెట్టుకున్నాడు. బాలీవుడ్ నుండి హీరోయిన్ గా జాన్వీ కపూర్ ని , అలాగే విలన్ గా సైఫ్ అలీ ఖాన్ ని తీసుకున్నాడు.
ఇలా మేకింగ్ విషయం లో ఎక్కడా ఖర్చుకి వెనకాడకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ కొరటాల శివ. కానీ బడ్జెట్ హద్దులు దాటిపోయింది, ఎన్టీఆర్ మార్కెట్ కి మించి ఎక్కడికో వెళ్ళిపోయింది. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా పూర్తి అయ్యే సమయానికి 400 కోట్ల రూపాయిలు బడ్జెట్ అవుతుందట. సినిమా ప్రధాన భాగం మొత్తం అండర్ వాటర్ యాక్షన్ సన్నివేశాలు ఉండడం వల్లే ఈ స్థాయిలో ఖర్చు అవుతుందని అంటున్నారు.
కానీ ఎన్టీఆర్ కి ఇప్పటి వరకు కనీసం వంద కోట్ల రూపాయిల షేర్ సినిమా కూడా లేదు. ఓపెనింగ్స్ తప్ప ఎన్టీఆర్ కి లాంగ్ రన్ పెద్దగా ఉండదు అనేది ట్రేడ్ పండితుల అభిప్రాయం. అలాంటి సమయం లో ఆయనని నమ్మి 400 కోట్లు ఖర్చు పెడితే అవి తిరిగి వస్తాయా?, ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించిన బిజినెస్ ఎక్కడా కూడా జరగలేదు. ఇది చాలా రిస్క్ అని, కాస్త తేడా వచ్చిన ‘ఆచార్య’ రేంజ్ డిజాస్టర్ ఫ్లాప్ తప్పదు అని అంటున్నారు విశ్లేషకులు.