సముద్రఖని కొడుకు ఇంతపెద్ద నటుడు అయ్యాడా..? తండ్రినే మించిపోయాడుగా !

- Advertisement -

ప్రస్తుతం సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో మంచి డిమాండ్ ఉన్న క్యారెట్స్ర్ ఆర్టిస్టుల లిస్ట్ తీస్తే అందులో సముద్ర ఖని ముందు వరుసలో ఉంటాడు. ఏ సినిమాలో చూసిన ఈయన కచ్చితంగా ఉండాల్సిందే. ప్రతీ శుక్రవారం విడుదల అయ్యే సినిమాలలో సముద్ర ఖని లేని సినిమా అంటూ లేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

సముద్రఖని
సముద్రఖని

నటుడు కాకముందు ఆయన మంచి దర్శకుడు, ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించి ఆ తర్వాత క్యారక్టర్ ఆర్టిస్టుగా కూడా సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం ఈయన ఉన్నంత బిజీ గా ఏ నటుడు లేదు. పోషించిన ప్రతీ పాత్ర కి మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. రీసెంట్ గానే ఆయన చాలా కాలం తర్వాత పవర్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘బ్రో ది అవతార్’ చిత్రానికి దర్శకత్వం కూడా వహించాడు. ఈ సినిమా పర్వాలేదు అనే రేంజ్ లో ఆడింది.

ఇదంతా పక్కన పెడితే సముద్ర ఖని కి ఒక కొడుకు ఉన్నాడని , అతను కూడా డైరెక్టర్ మరియు నటుడు అనే విషయం చాలా మందికి తెలియదు. ఆయన కొడుకు పేరు హరి విగ్నేశ్వరన్, ఈయన యూట్యూబ్ లో ఎన్నో పాపులర్ షార్ట్ ఫిలిమ్స్ కి దర్శకత్వం వహించాడు. చూసేందుకు పెద్దగా అందంగా ఉండదు కానీ, ఆయనలోని టాలెంట్ మాత్రం అద్భుతం అనే చెప్పాలి.

- Advertisement -

తండ్రికి తగ్గ తనయుడు. కేవలం దర్శకత్వం వహించడం మాత్రమే కాకుండా, పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించాడు కూడా. ఇన్ని రోజులు కేవలం యూట్యూబ్ కి మాత్రమే పరిమితమైన హరి విగ్నేశ్వరన్ ఇప్పుడు అతి త్వరలోనే వెండితెర అరంగేట్రం కూడా చెయ్యబోతున్నాడు. ప్రస్తుతం ఈ కుర్రాడి ద్రుష్టి మొత్తం దర్శకత్వం వైపే ఉంది, కానీ భవిష్యత్తులో తండ్రిలాగానే పెద్ద నటుడు కూడా అవుతాడో లేదో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here