Unstoppable 2 : షాకింగ్ న్యూస్..అండ్ బ్రేకింగ్ న్యూస్.. బాలయ్య హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షో పై కోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది..షో అనధికార స్ట్రీమింగ్, ప్రసారాలను వెంటనే నిలుపుదల చేయాలని దిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది..నందమూరి బాలకృష్ణ యాంకర్ గా చేస్తున్నా ‘ఆహా’ ఓటీటీ వేదికగా ఈ షో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా ‘అన్‌స్టాపబుల్’ ఎపిసోడ్లు, ప్రోమోలను సామాజిక మాధ్యమాల వేదికగా పలువురు షేర్ చేస్తున్నారు.
కొన్ని ఎపిసోడ్లకు సంబంధించి షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఫొటోలు, వీడియోలు ఆన్‌లైన్‌లోకి వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో అర్హ మీడియా అండ్ బ్రాడ్‌కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఢిల్లీ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ సంజీవ్ సచ్దేవ్ కీలక ఆదేశాలు జారీ చేశారు.. ఈ వార్త చాలా మందికి మింగుడు పడక పోవచ్చు కానీ ఇది అక్షరాల నిజం..
ఈ మేరకు ప్రసారం కాకుండా ఆదేశాలు ఇవ్వాలని లాయర్ ప్రవీణ్ ఆనంద్, అమిత్ నాయక్‌లు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అనధికారిక ప్రసారాల వల్ల షో నిర్వాహకులు వాణిజ్యపరంగా నష్ట పోవాల్సి వస్తోందని కోర్టుకు విన్నవించారు. ఇలాంటి వాటిని అడ్డుకునేందుకు ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వాల్సిందిగా న్యాయమూర్తిని కోరారు.. ఇప్పుడు పలు వెబ్‌సైట్స్‌తో పాటు ఇతర మీడియా మాధ్యమాలపై చర్యలు తీసుకునేలా ‘డైనమిక్ ఇంజక్షన్’ ఇవ్వకపోతే ఫిర్యాదిదారుకి పూడ్చలేని నష్టం వస్తుందని కోర్టు పేర్కొంది.
అందుకే తదుపరి విచారణ వరకూ మధ్యంతర ఇంజెక్షన్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. మరోవైపు ‘అన్‌స్టాపబుల్‘ షోకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో ఉన్న అనధికారిక లింకులను తొలగించాలని సంబంధిత అధికారులకు కోర్టు ఆదేశాలను జారీ చేసింది. దీని పై స్పందించాలని కోరింది..ఇందులో నిజమేంత ఉందో లేదో తెలియదు..ఏమో ఈలోపు ఏదైనా జరగొచ్చు..