సమంతకు విజయ్ దేవరకొండకు అన్ని లిప్ లాక్ లు అవసరమా? దర్శకుడి దిమ్మతిరిగే సమాధానమిదే!

- Advertisement -

సమంత, విజయ్ దేవరకొండ జంటగా నటించిన తాజా సినిమా ఖుషి. నిన్ను కోరి, మజిలి చిత్రాల డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఖుషి సినిమాపై మొదటి నుంచి అంచనాలు విపరీతంగా పెరిగాయి. అందుకు తగినట్లుగానే సినిమాలోని పాటలు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఖుషి ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో అటు రౌడీ ఫ్యాన్స్, ఇటు సమంత అభిమానులు సినిమా కోసం ఎంతగానో ఎదురుచూశారు. ఎట్టకేలకు సెప్టెంబర్ 1న థియేటర్లలోకి అడుగుపెట్టింది ఖుషి సినిమా. సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. విప్లవ్‌, ఆరాధ్య పాత్రల్లో విజయ్‌, సామ్‌ అద్భుతంగా నటించారని సినీ ప్రియులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం తాజాగా ప్రెస్‌మీట్‌ నిర్వహించింది. ఇందులో భాగంగా విలేకర్లు అడిగిన పలు ప్రశ్నలకు శివ సమాధానాలు ఇచ్చారు.

విజయ్ దేవరకొండ పాత్ర గురించి చెబుతూ..‘‘ మధ్యతరగతి కుటుంబంలో ఒక హీరో ఉంటాడు. మనం నమ్మిన సిద్ధాంతాల కోసం నిలబడటంలోనే ఒక హీరోయిజం ఉంటుంది. దాన్నే నేను నమ్ముతా. ఆ విధంగానే ఈ కథ, అందులోని పాత్రలను తీర్చిదిద్దా. సిద్ధాంతాలు, నమ్మకాల కంటే మనిషిగా గెలవడం ముఖ్యం అనే లైన్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించా. నేను చెప్పాలనుకున్న పాయింట్‌ విషయంలో ఎంతో స్పృహతో ఉన్నా. చివరి అరగంట సినిమాతో ప్రేక్షకులను మరింత ఆలోచింపచేయాలనుకున్నా. 100 శాతం అది వర్కౌట్‌ అయ్యింది. అందుకు సంతోషంగా ఉన్నా’’ అని చెప్పారు.

samantha-vijay-deverakonda

ఇక సినిమాలో లిప్ లాక్ ల గురించి మాట్లాడుతూ.. ‘‘విప్లవ్‌ పాత్ర ఎంతో సింపుల్‌గా ఉంటుంది. సింప్లిసిటీలోనే ఎఫెక్ట్‌ ఎక్కువ ఉంటుందని నేను నమ్ముతా. కథకు అనుగుణంగానే విప్లవ్‌ పాత్రను సిద్ధం చేశా. కశ్మీర్‌లో వచ్చే కామెడీ ట్రాక్‌.. రెండు వర్గాల నేపథ్యంలో కథ అనే సరికి విజయ్‌కు బాగా నచ్చింది. అందుకే ఆయన ఓకే అన్నారు. ఆరాధ్య అనే పాత్రకు అది అవసరం అందుకే పెట్టా. ప్రేమ పెళ్లి, పిల్లలు.. అనే ఎమోషన్‌ పెట్టినప్పుడు ఆ చిన్న ముచ్చట కూడా లేకపోతే అర్థం పర్థం ఉంటుందా..! వాళ్లు నిజమైన కపుల్‌ అనే భావన సినిమా చూసే ప్రేక్షకులకు కలగాలి. అందుకే ఆ సీన్స్‌ పెట్టా’’ అని అన్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here