స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ కథనాయకుడుగా ఎంపికైన సంగతి అందరికి తెలిసిందే. ఇప్పటి వరకూ తెలుగులో ఏ హీరో కూడా సాధించని రేర్ ఫీట్‌ని అల్లు అర్జున్ సాధించి చూపించారు. తెలుగులో ఏ హీరోకు కూడా జాతీయ ఉత్తమ అవార్డు వచ్చింది లేదు. 69 ఏళ్ల జాతీయ అవార్డుల చరిత్రలో ఓ తెలుగు నటుడు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు కైవసం చేసుకోవడం ఇదే తొలిసారి. దీంతో తెలుగు ఇండస్ట్రీ మొత్తం సంబరాల్లో మునిగిపోయింది.

అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా నామినేట్ కావడం పట్ల తెలుగు హీరోలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. పలువురు సెలబ్రిటీలు అల్లు అర్జున్‌కు సోషల్ మీడియా ద్వారా విషెష్ తెలిపారు. 2021లో విడుదలైన ‘పుష్ప’ మొదటి పార్ట్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమాలోఅల్లు అర్జున్ మేనరిజంకు అభిమానులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా బాలీవుడ్లో కూడా ఈ సినిమా సత్తా చాటింది. ఇదిలా ఉంటే ..అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డు వచ్చిందంటే అది ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి వల్లేనని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

గతంలో ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో అల్లు అర్జున్ జాతకం గురించి వేణు స్వామి ఇలా చెప్పుకొచ్చారు. నిజం చెప్పాలంటే తెలుగులో అసలైన ప్యాన్ ఇండియా స్టార్ అల్లు అర్జునే అని .. ఆయనపై రూపాయి పెట్టుబడి పెడితే.. 10 రూపాయిలు వస్తాయని తెలిపారు. మరో పదేళ్లు వరకూ ఆయనకు ఎటువంటి ఢోకా లేదని… ‘పుష్ప’తో అల్లు అర్జున్ సంచలనాలు సృష్టించడం ఖాయమని వేణు స్వామి చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్ జాతీయస్థాయిలో సత్తా చాటుతారని వేణు స్వామి గతంలోనే చెప్పారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.