మెగాస్టార్ ని ఇమిటేట్ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసిన ప్రభాస్.. వైరల్ అవుతున్న వీడియో!

- Advertisement -

మన జీవితం లో చిన్న తనం నుండి ఎంటర్టైన్మెంట్ విషయం లో మనం అమితంగా ఇష్టపడి చూసేది మెగాస్టార్ చిరంజీవి సినిమాలు. ఇప్పుడు మనం ఏ హీరో ఫ్యాన్ అయినా అయ్యుండొచ్చు కానీ, మన చిన్నతనం లో మాత్రం మెగాస్టార్ చిరంజీవి ఫ్యానిజం నుండి తప్పించుకోలేము. ఇది కేవలం మనకి మాత్రమే కాదు, టాలీవుడ్ స్టార్ సెలెబ్రిటీలు కూడా ఇండుకు ఏ మాత్రం అతీతం కాదు. వాళ్ళు కూడా చిన్నతనం లో మెగాస్టార్ చిరంజీవి అభిమానులే.

మెగాస్టార్
మెగాస్టార్

అలాంటి హీరోలలో ఒకరు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఆయన చిన్నతనం నుండి చిరంజీవి గారి అభిమానిని అంటూ ఎన్నో ఇంటర్వ్యూస్ లో తెలిపాడు. ప్రతీ పుట్టినరోజు కి ప్రభాస్ ప్రత్యేకంగా చిరంజీవికి శుభాకాంక్షలు తెలియచేస్తాడు. ఇక ఈ ఏడాది ఎందుకు ఇంకా శుభాకాంక్షలు తెలియచేయలేదు అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అలా ఎదురు చూస్తున్న అభిమానులకు ‘కల్కి’ మూవీ టీం అదిరిపోయే రేంజ్ సర్ప్రైజ్ ని ఇచ్చింది.

మెగాస్టార్ చిరంజీవి గ్యాంగ్ లీడర్ లో వెల్డింగ్ చేస్తున్న ఫోజుని ప్ర బాస్ కల్కి సినిమాలో ఇమిటేట్ చేస్తూ ఒక వీడియో ని వదిలారు. మెగాస్టార్ చిరంజీవి తో ఇంద్ర , జగదేక వీరుడు అతిలోక సుందరి వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను తీసిన అశ్వినీదత్ ఈ చిత్రాన్ని సుమారుగా 600 కోట్ల రూపాయిల బడ్జెట్ తో నిర్మిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

- Advertisement -

అమితాబ్ బచ్చన్ , కమల్ హాసన్ ,ప్రభాస్ , దీపికా పదుకొనే, దుల్కర్ సల్మాన్ ఇలా ఇంత మంది సూపర్ స్టార్స్ కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ , చిరంజీవి కి ఇంత స్పెషల్ గా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేయడం అనేది మామూలు విషయం కాదు. ఇది పూర్తిగా మెగాస్టార్ చిరంజీవి మీద అభిమానం తో చేసింది అని అర్థం అవుతుంది. ఎంత పెద్ద రేంజ్ కి వెళ్లిన ఒదిగి అదే ప్రభాస్ నుండి ఇలాంటివి చాలా కామన్ గా ఆశించవచ్చు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here