Rashmika : నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి చెప్పనక్కర్లేదు. కన్నడ బ్యూటీ అయినా కూడా తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతో బాగా పాపులర్ అయ్యింది. సూపర్ హిట్స్ తో పాటు మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది రష్మిక మందన్న ఇటీవలే పుష్ప తో పాన్ ఇండియా స్టార్ డమ్ కూడా అందుకుంది. ఇకపోతే ఓ ఈవెంట్ కు వెళ్తూన్న రష్మికకు చేదు అనుభవం ఎదురైంది..ఫ్యాన్స్ ఆమె కారును వెంబడించారు..కారు ఆపి వారితో మాట్లాడి వెళ్ళింది..అందుకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.
తమిళ హీరో దళపతి విజయ్ ప్రధాన పాత్రలో వస్తున్న వారీసు లో నటిస్తోంది రష్మిక. ఈ సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ ను తెలుగులో వారసుడు అనే టైటిల్ తో రిలీజ్ చేయనున్నారు. కాగా ఇటీవలే వారీసు ప్రీరిలీజ్ ఈవెంట్ చెన్నై లో గ్రాండ్ గా జరిగింది. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కు వెళ్తోన్న రష్మికకు ఓ వింత ఘటన ఎదురైంది. కారులో రష్మిక వెళ్తుండగా ఆమె కారును నలుగురు వ్యక్తులు ఫాలో చేశారు. దాంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యింది.
అప్పుడు కారు సిగ్నల్ దగ్గర ఆగగానే రష్మిక విండో గ్లాస్ దించి వాళ్లతో మాట్లాడింది. ఆపి హెల్మెట్ పెట్టుకోండి.. జాగ్రత్త అంటూ చెప్పింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.. ఈ వీడియో పై నెటిజన్లు మాత్రం రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా ఆమె చాలా మంచిది అని కొంతమంది.. మా హృదయాలను గెలుచుకున్నావ్ రష్మిక అని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. కార్తి నటించిన సుల్తాన్ తో తమిళ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది రష్మిక.
ఆ తర్వాత ఇప్పుడు వారీసు తో మరోసారి అక్కడి ప్రేక్షకులను పలకరించనుంది. తెలుగులో పుష్ప2 సినిమాలో కూడా చేస్తుంది.. ఇక బాలివుడ్ లో కూడా పలు సినిమాలు చేసింది.. మిస్టర్ మజ్ను సినిమా లో చేసింది.. ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా రష్మిక గురించి చాలా రకాల వార్తలు వినిపించాయి. ఆమెను బ్యాన్ చెయ్యాలని అనుకున్నారంటూ అన్నారట.. దానిపై కూడా అమ్మడు క్లారిటి ఇచ్చింది..