Shruti Haasan : కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు..మొదటి సినిమా తో మంచి టాక్ ను అందుకుంది.అంతేకాదు స్టార్ హీరోల సరసన కూడా ఆమె నటించింది..అందుకే ఇప్పటికీ కూడా ఇండస్ట్రీలో మంచి టాక్ వుంది..ఇకపోతే ఈమె ఎంత పాపులర్ అయ్యిందో అంతకు మించి రుమెర్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి.. ఎప్పుడూ బాయ్ ఫ్రెండ్ లవ్ పేర్లతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.. ఇంగ్లండ్‌కు చెందిన సింగర్ మైఖేల్ కోర్సలేతో శ్రుతి ప్రేమాయణం బాగా వైరల్ అయింది. మైఖేల్‌తో కొన్నాళ్లు సహజీవనం చేసిన శృతి.. ఆ తర్వాత అతడితో విడిపోయింది. బ్రేకప్ బాధలో డిప్రెషన్‌లో కూరుకుపోయి కెరీర్ ను గాలికి వదిలేసింది. అయితే వెంటనే డిప్రెషన్ నుంచి బయట పడి కెరీర్ ను గాడిన పెట్టుకుంది.
అలాగే ప్రముఖ డూడుల్ ఆర్టిస్ట్ శాంతాను హజారికా తో కొత్తగా ప్రేమలో పడింది. దాదాపు రెండేళ్ల నుంచి వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారు. తమ రిలేషన్ కి సంబంధించిన అప్ డేట్స్ ని సైతం శృతి హాసన్ ఎప్పటకప్పుడు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటుంది. అయితే ఇటీవల ఈమె సింగిల్ లైఫ్ గురించి పోస్ట్ పెట్టడంతో.. శాంతానుతో ఈమె విడిపోయిందంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఈ వార్తలకు పుల్ స్టాప్ పెడుతూ.. శృతి శాంతాను తో క్లోజ్ గా ఉన్న ఫోటోతో ధీటైన సమాధానం ఇచ్చింది.దానికి రకరకాల కామెంట్లు వస్తున్నాయి..
తాజాగా సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్ల గురించి శృతి బోల్డ్ కామెంట్స్ తో కౌంటర్లు వేసింది. ఈ క్రమంలోనే శాంతాను గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను, శాంతాను బెస్ట్ ప్రెండ్స్ అని, ఇద్దరం ఎప్పుడు కలిసి ఉంటామని తెలిపిన బ్యూటీ, సోషల్ మీడియాలో కామెంట్లు కూడా కలిసే చదువుతామని, అయితే అవి చదివినప్పుడు కామెడీగా ఉంటుందని, అప్పుడు ఆపుకోలేమని చెప్పింది..
అంతేకాదు..అతను చాలా మంచి వాడని అందుకే అతడంటే తనకెంతో ఇష్టమని శ్రుతి పేర్కొంది. అంతేకాదు, శాంతాను వల్లే తాను ప్రశాంతంగా, దయగల అమ్మాయిగా మారానని చెప్పుకొచ్చింది. దీంతో ఈమె కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా, సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో శ్రుతి హాసన్ ప్రభాస్‌కు జోడీగా సలార్
, చిరంజీవితో వాల్తేరు వీరయ్య
, బాలయ్య సరసన వీర సింహా రెడ్డి
చిత్రాలు చేస్తోంది..ఆ సినిమాలు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి..