ఒకప్పుడు తెలుగు సినీ ఆర్టిస్టుగా ప్రేక్షకులకు పరిచయం ఉన్న సురేఖ వాణి ప్రస్తుతం సోషల్ మీడియాలో కూతురితో కలిసి రచ్చ సృష్టిస్తోంది. సినిమాల్లో ఎంతో ట్రెడిషనల్ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చిన సురేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ సెటర్. ఆమె కూతురుతో కలిసి స్టెప్పులు వేస్తూ సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది.సురేఖ ఆమె కూతురు సుప్రీత తో కలిసి సోషల్ మీడియాలో బాగా బిజీ అయిపోయింది.

వాళ్ళ హాట్ ఫొటోస్, రొమాంటిక్ స్టెప్స్ కు కుర్రాళ్ళ మనసులు దోచుకుంటున్నాయి.పొట్టి పొట్టి బట్టలు , ట్రాన్స్పరెంట్ చీరలు..ఇలా సూపర్ హాట్ గా రెడీ అయ్యి ఈ తల్లి కూతుర్లు వేసే స్టెప్పులకు నెటిజన్లు షేక్ అవుతున్నారు. కిరణ్ అబ్బవరం ,నేహా శెట్టి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం నుంచి సమ్మోహనుడా అనే పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ గా ఉంది. సాధారణంగా పాపులర్ అయిన ప్రతి పాటకి స్టెప్పులు వేయడం అలవాటైపోయిన ఈ తల్లి కూతుర్లు ఈ మూవీ సాంగ్ కూడా ఓ రేంజ్ లో రెచ్చి పోయారు.

వింటేనే మైకం తెప్పించి మత్తెక్కించి ఈ పాటను శ్రేయ ఘోషల్ పాడారు.సమ్మోహనుడా సాంగ్ కి వీరిద్దరూ డాన్స్ వేస్తూ తన గ్లామర్ షో చేశారు. ప్రస్తుతం ఈ డాన్స్ వీడియో బాగా వైరల్ అయింది. బ్లూ సారీ లో సురేఖ, బ్లాక్ సారీ లో సుప్రీత..సమ్మోహనుడా అని అంటూ డాన్స్ వేస్తుంటే…కుర్ర కారు ఊగిపోతున్నారు. కొందరు మాత్రం కూతుర్ని పెట్టుకొని ఈ వయసులో ఏంటా పనులు అని కామెంట్ చేస్తున్నారు.