ఖుషి మ్యూజికల్ నైట్ సందర్భంగా మళ్లీ ఎమోషనల్ అయినా సమంతా….

- Advertisement -

స్టార్ హీరోయిన్ సమంత మరియు సింగర్ చిన్మయి మధ్య ఉన్నటువంటి స్నేహబంధం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కెరియర్ బిగినింగ్ నుంచే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ గా మారారు ఆ తర్వాత ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా వాళ్ళ ఫ్రెండ్షిప్ ని కంటిన్యూ చేస్తూ వచ్చారు. నిన్న జరిగిన ఖుషి మ్యూజికల్ నైట్ లో చిన్మయి స్టేజి పైన ఎమోషనల్ అయింది. సమంత యాక్ట్ చేసిన ఎన్నో సినిమాలలో ఆమె క్యారెక్టర్ కు వాయిస్ ఓవర్ ఇచ్చింది చిన్మయి.నిన్న జరిగినటువంటి మ్యూజికల్ నైట్ లో పార్టిసిపేట్ చేసిన చిన్న సమంత గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

సమంత
సమంత

సమంత ఎందరికో స్ఫూర్తి అని చిన్మయి చెప్పడం విశేషం. ప్రపంచంలో మంచి మనసు ఉన్న డేరింగ్ పర్సనాలిటీ నువ్వే సామ్ అని ఆమె స్టేజి పైన అందరి ముందు చెప్పింది. అంతేకాదు తన కెరియర్ ప్రారంభం అవ్వడానికి కూడా సమంతే కారణమని చిన్మయి అంది.ఈ నేపథ్యంలో సమంత కూడా చిన్మయిని ఉద్దేశిస్తూ ..ఆమెది ఎంతో నిర్మలమైన మనసు అని అంది. నీ మనసు ఎంత అందంగా ఉందో అంతకంటే అందమైన గాత్రం దేవుడు నీకు ప్రసాదించాడు అని సమంత చిన్మయిని పొగిడింది.

చాలా రోజుల తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి దిగిన ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.ఈవెంట్ సందర్భంగా విజయ్ తో కలిసి సమంత మంచి రొమాంటిక్ డాన్స్ కూడా చేసింది. విజయ్ అయితే ఏకంగా బనియన్ మీదే కండలు ప్రదర్శిస్తూ రచ్చ పుట్టించాడు. వీళ్ళిద్దరు కు సంబంధించిన పిక్స్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

- Advertisement -

శకుంతలం తర్వాత వస్తున్న సమంత చిత్రం కావడంతో ఈ మూవీపై ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. ఇటు విజయ్ దేవరకొండ కూడా ఈ చిత్రంతో ఎలాగైనా సక్సెస్ కొట్టాలి అని ఆశిస్తున్నాడు. సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్న ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఏమాత్రం నిలబడుతుందో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here