చాలామందికి తమిళ స్టార్ హీరో మన రాష్ట్రానికి చెందిన వాడని తెలయదు. అవును ఆయన సికింద్రాబాదులోనే పుట్టి పెరిగాడు. కానీ హీరోగా కెరీర్ మాత్రం తమిళ ఇండస్ట్రీ నుంచి స్టార్ట్ చేశాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరో అయ్యాడు. తమిళనాడులో రజనీ తర్వాత అంతటి ఇమేజ్ గ్రాఫ్ పెంచుకున్నాడు. హీరో అజిత్ మల్టీ టాలెంటెడ్. తాను చదివింది పదో తరగతి అయినా అనేక భాషలను అనర్గళంగా మాట్లాడగలడు. ఇదే ఆయనకు ప్లస్. వెండి తెరపై అయినా బయట అయినా చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తుంటాడు. జుట్టు మొత్తం తెల్లబడినా.. ఏమాత్రం రంగు వేసుకోకుండా బ్యాక్ టు బ్యాక్ హీరోగానే వరుస సినిమాలు చేసుకుంటూ సక్సెస్ సాధిస్తున్నాడు.
ఇక అజిత్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే తన కెరీర్ పీక్స్ లో ఉండగానే ఒకప్పటి టాప్ హీరోయిన్ షాలినిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2000 సంవత్సరంలో పెళ్ళి అమిన తర్వాత తన భార్య షాలిని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. తర్వాత వారికి ఇద్దరు పిల్లలకు కలిగారు. వారిలో ఒకరు కూతురు మరొక కొడుకు. వారి పేర్లు అనౌష్క, ఆద్విక్. అజిత్ సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా తన ఫ్యామిలీకి అధిక ప్రాధాన్యత ఇస్తాడు. టైం దొరికితే చాలు తన భార్యపిల్లలతో కలిసి వేకేషన్స్ కు వెళ్తుంటారు.
అంతే కాకుండా ఫెస్టివల్స్, బర్త్డేస్, స్పెషల్ డేస్ ను అజిత్ అస్సలు మిస్ అవ్వడు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇప్పటివరకు అజిత్ కు సోషల్ మీడియాలో అకౌంట్ లేదు. తానే కాకుండా తన ఫ్యామిలీ కూడా దూరం. ఇకపోతే అజిత్ కూతురు అనౌష్కను ఎప్పుడైనా చూశారా… తన ముందుక హీరోయిన్లు కూడా తేలిపోతారు. అంత అందం తనది. తల్లి షాలిని కూడా తన అందం ముందు దిగదుడుపే. ప్రస్తుతం అనౌష్క వయసు 15 తాను ఫారిన్లో ప్రస్తుతం విదేశాల్లో చదువుకుంటుంది.