తెలుగు చలన చిత్ర పరిశ్రమ తో పాటుగా ప్రతీ తెలుగోడు ఇతను మావాడు, మా అన్నయ్య అని గర్వంగా చెప్పుకునే వ్యక్తులలో ఒకరు నందమూరి తారకరామారావు గారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి గా కొనసాగుతున్న ఆయన, సినిమాల మీద మక్కువతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, హీరో గా ఎవ్వరూ ఊహించని స్థాయికి చేరుకొని, ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించి, ఆంధ్రుల ఆరాధ్య దైవంగా ఎదిగాడు ఆయన.
శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు గురించి మనం పురాణాల్లో అంతకు ముందు కేవలం చదివాము కానీ, దానికి వెండితెర దృశ్య రూపం ఇచ్చింది మాత్రం ఎన్టీఆర్ గారే. అందుకే ఆయనని జనాలు దేవుడిలాగా కొలిచేవారు. అలా సినీ జీవితాన్ని కొనిసాగించిన ఆయనకీ పేదవాళ్ల ఆకలి చావులు కదిలించి వేసాయి. వాళ్లకి అండగా నిలబడేందుకు కోసం తెలుగు దేశం పార్టీ ని స్థాపించి రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. పార్టీ పెట్టిన ఆరు నెలల్లోనే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 290 స్థానాల్లో 270 స్థానాలను గెలిచి తెలుగువాడి ఆత్మగౌరవం ని ప్రపంచం మొత్తానికి చాటి చెప్పిన మహానుభావుడు ఆయన.
అయితే ఎంతటి గొప్పవాళ్లకు అయినా ప్రత్యర్థులు కచ్చితంగా ఉంటారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్ని వికృత వేషాలు వేస్తారు, కుట్రలు కుతంత్రాలు కూడా చేస్తారు. అలా ఎన్టీఆర్ మీద కూడా అప్పట్లో చాలా కుట్రలు జరిగాయి. ముఖ్యంగా ఆయనపై ఎన్నో విష ప్రచారాలు కూడా చేసేవారు. అందులో ఒక ప్రచారం అప్పటి రాజకీయాల్లో పెను దుమారమే రేపింది. అదేమిటంటే అప్పట్లో ఎన్టీఆర్ ప్రముఖ హీరోయిన్ దేవిక కూతురు ని సీనియర్ ఎన్టీఆర్ రహస్యం గా ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకున్నాడని.
ఆమె వయస్సు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే ఉండేదని, ఎన్టీఆర్ కి 70 ఏళ్ళ వయస్సు ఉండేదని ఒక విష ప్రచారం మొదలు పెట్టారు. ఆ తర్వాత కొన్నాళ్ళకు ఆ అమ్మాయితో విడాకులు కూడా తీసుకున్నాడు అంటూ రూమర్స్ పుట్టించారు. ఈ విష ప్రచారం పై అప్పట్లో దేవిక మీడియా ముందుకు వచ్చి ఖండించింది, ఈ పుకార్లు పుట్టించిన వారిని ఊరికే వదిలిపెట్టను అంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది. రాజకీయాలు ఎంత వికార రూపం లో ఉంటుందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.