హీరో విశాల్ కారణంగా నాశనమైన అబ్బాస్ జీవితం..దారుణంగా మోసం చేశాడట పాపం..

- Advertisement -

‘ప్రేమదేశం’ సినిమాతో అప్పటి యూత్‌లో విశేష క్రేజ్‌ సంపాదించుకున్న నటుడు అబ్బాస్‌. విభిన్న పాత్రలు పోషించిన ఆయన 2015లో ఇండస్ట్రీకి దూరమయ్యారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా న్యూజిలాండ్‌లో స్థిరపడ్డారు. కొన్ని రోజుల క్రితం స్వదేశానికి (చెన్నై) తిరిగొచ్చిన అబ్బాస్‌ కోలీవుడ్‌ మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. వాటిల్లోని ఓ చిట్‌చాట్‌లో పలువురు తమిళ హీరోలపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌’ (సీసీఎల్‌) విషయంలో నటుడు విశాల్‌తో విభేదాలు వచ్చినట్టు తెలిపారు.

అబ్బాస్
అబ్బాస్

‘‘చిత్ర పరిశ్రమకు చెందిన వారందరితో మంచి బంధాన్ని పెంపొందించుకోవాలనేది నా లక్ష్యం. నటుల మధ్య సోదరభావం ఉండాలనే ఉద్దేశంతో ‘సీసీఎల్‌’ని ప్రారంభించారు. ఆ లీగ్‌ సెకండ్‌ సీజన్‌లో విశాల్‌తో మనస్పర్థలు తలెత్తాయి. అతడు నా గురించి ఇతరులకు అబద్ధాలు చెప్పేవాడు. నాకు మర్యాద దక్కని చోటు ఉండడం ఇష్టంలేక ఆటను వదిలేయాలని నిర్ణయించుకున్నా. విశాల్‌ అన్న మాటలకు అప్పుడు ఎంతో బాధపడ్డా. అతడు ఏదో ఒక రోజు జరిగిన విషయాన్ని అర్థం చేసుకుని, రియలైజ్‌ అవుతాడని అనుకున్నా. ఏదేమైనా విశాల్‌ ఇప్పటికీ ఫ్యామిలీ (చిత్ర పరిశ్రమ)లో ఓ భాగం. ఏ కుటుంబంలోనైనా మనస్పర్థలు రావడం సహజం. అతడిని నేనెప్పుడో క్షమించా. అతడు నాకు ఎదురైతే ‘హాయ్‌’ అంటూ పలకరిస్తా. కానీ, మునుపటిలా సన్నిహితంగా ఉండలేను’’ అని ఆనాడు చోటు చేసుకున్న పరిణామాన్ని వివరించారు.

ఇక విజయ్, సూర్యల గురించి కూడా తన మనసులో మాట పంచుకున్నారు అబ్బాస్. ‘‘విజయ్‌ చాలా సరదా వ్యక్తి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం ఆయనది. ఎందులోనూ హద్దులు దాటడు. అతడి గత చిత్రాలను నేను ఇష్టపడను. కానీ, ఇప్పుడు విజయ్‌ని అభిమానిస్తున్నా. అతడి కొత్త సినిమాల్లో సందేశం ఉంటుంది’’ అని అన్నారు. ‘‘సూర్య తెరంగేట్రం చేసిన సమయం నుంచే అతడు నాకు తెలుసు. తొలినాళ్లలో అతడు నలుగురిలో మాట్లాడేందుకు, కెమెరా ముందు చాలా సిగ్గుపడేవాడు. ఇప్పుడు అతనిలో మార్పు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. కథల ఎంపికలో అతడికి ఉన్న స్పష్టత, సినిమాలపై అంకితభావం అభినందనీయం’’ అని అబ్బాస్‌ కొనియాడారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here