పెళ్లి కాకుండానే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా..

- Advertisement -

నటి ఇలియానా తల్లి అయ్యింది. ఆగస్టు 1న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ మేరకు చిన్నారి ఫొటోను షేర్‌ చేస్తూ తన ఆనందాన్ని పంచుకుంది. మా ప్రియమైన అబ్బాయి ‘కోవా ఫీనిక్స్ డోలన్‌’ని పరిచయం చేస్తున్నాను. మా హృదయాలను దాటి ప్రపంచానికి పరిచయం చేస్తున్నందుకు ఎంత సంతోషిస్తున్నామో మాటల్లో చెప్పలేం అని పేర్కొంది. ఈ పోస్ట్‌ చూసిన పలువురు నెటిజన్లు, ప్రముఖులు ఇలియానాకు అభినందనలు చెబుతున్నారు.

ఇలియానా
ఇలియానా

ఇక పెళ్లి కాకుండానే తళ్లయింది ఇలియానా. తాను ప్రెగ్నెంట్ అని సింబాలిక్‌గా చెబుతూ కొద్ది రోజుల కిందటే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై ఓ ఫొటోను పోస్ట్ చేసింది. బేబీ బంప్‌తో కనిపించిందా ఫొటోల్లో. అప్పట్లో బ్లాక్ డ్రెస్‌లో బేబీ బంప్‌ను చూపిస్తూ షేర్ చేసిన ఫోటోలు వైరల్‌ అయ్యాయి. బంప్ అలర్ట్ అని కోట్స్‌లో పెడుతూ పోస్ట్ చేసింది. ప్రెగ్నెంట్ అయినట్లు బయట ప్రపంచానికి చెబుతూ అడ్వెంచర్ బిగిన్స్, త్వరలోనే నా బిడ్డను కలుసుకోబోతున్నాను అంటూ కామెంట్స్‌ను వాటికి జత చేసింది.

తాజాగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది ఇల్లీ బేబ్. పేరు కూడా పెట్టేసింది. కోవా ఫీనిక్స్ డోలన్ (Koa Phoenix Dolan) అని తన మగబిడ్డకు నామకరణం చేసినట్లు తెలిపింది. ఆ చిన్నారి ఫస్ట్ ఫొటోను కూడా తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై షేర్ చేసింది ఇలియానా. బాబు నిద్రపోతున్న ఓ బ్లాక్ అండ్ వైట్ ఫొటోను ఇలియానా పోస్ట్ చేసింది. ఇంట్రడ్యూసింగ్ కోవా ఫీనిక్స్ డోలన్ అంటూ కామెంట్స్ పెట్టింది. ఈ ఆనందాన్ని వర్ణించడానికి మాటలు రావట్లేదని పేర్కొంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here