Kalki : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ సినిమాల్లో ఒక్కో సినిమా రెండు భాగాలుగా రూపొందుతున్నట్టుగా తెలుస్తోంది. ఆయన నటిస్తున్న క్రేజీ మూవీస్ సలార్
, కల్కి 2898ఏడీ
. ఈ రెండు సినిమాల్లో ఇప్పటికే ప్రశాంత్ నీల్ అత్యంత భారీ స్థాయిలో రూపొందిస్తున్న సలార్
రెండు భాగాలుగా రానుందని తేలిపోయింది. ఇటీవలే సలార్
టీజర్‌ని విడుదల చేసిన టీమ్ ఈ సినిమా టు పార్ట్స్‌గా రాబోతోందని స్పష్టం చేశాయి. ఇదేయ తరహాలో కల్కి 2898ఏడీ
కూడా రెండు భాగాలుగా రాబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల యుఎస్‌లో జరిగిన శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్‌లో కల్కి 2898ఏడీ
టైటిల్‌తో పాటు గ్లింప్స్‌ని విడుదల చేయడం తెలిసిందే. రూ.600 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ టైమ్ ట్రావెల్ సైన్స్ ఫిక్షన్‌ని అత్యంత భారీ స్థాయిలో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు.
సినిమాకు భారీ స్థాయిలో వీఎఫ్ ఎక్స్ వర్క్ ఉన్న నేపత్యంలో వచ్చే ఏడాది సంక్రాంతికి కల్కి 2898
ఏడీ
రిలీజ్ కావడం కష్టం అని తెలుస్తోంది. అంతే కాకుండా ఈ సినిమాని సలార్
తరహాలోనే రెండు భాగాలుగా చేస్తున్నారని. ఫస్ట్ పార్ట్‌ని వచ్చే ఏడాది మే 9న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మే 9నే ఎందుకు అంటే ఆరోజు అశ్వనీదత్‌కు చాలా ఇష్టమైన రోజు. ఇదే రోజున జగదేక వీరుడు అతిలోక సుందరి
విడుదలై ప్రతికూల పరిస్థితుల్లోనూ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఇక అశ్వనీదత్ ని వరుస ఫ్లాపుల్లోంచి బయటపడేసిన మహానటి
విడుదలైంది కూడా మే 9నే. అందుకే ఆ ప్రత్యేకమైన రోజున కల్కి 2898 ఏడీ
పార్ట్ 1ని అశ్వనీదత్ రిలీజ్ చేయాలనుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
అశ్వనీదత్ యంగ్ అండ్ టాలెంట్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. అబితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దీపికా పదుకునే, దిషా పఠాని హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ గ్లింప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి ట్రెండ్ సెట్ చేస్తోంది. భారతీయ సినీ చరిత్రలోనే అత్యతం ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ మూవీని 2024, జనవరి 12న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తామంటూ చిత్ర బృందం ప్రకటించింది. అయితే రీసెంట్‌గా విడుదల చేసిన గ్లింప్స్‌లో మాత్రం రిలీజ్ డేట్‌ని ప్రకటించలేదు. కేవలం 2024లో రిలీజ్ చేస్తున్నామంటూ ప్రకటించిందే కానీ ప్రత్యేకంగా డేట్‌ని ప్రకటించకపోవడంతో కల్కి 2898 ఏడీ
వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావడం కష్టమనే సంకేతాలు వినిపిస్తున్నాయి.