Kalki : లీకైనా ‘కల్కి’ ప్టోరీ.. కథ వింటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయిగా..

- Advertisement -

Kalki : ప్ర‌భాస్ ప్రాజెక్ట్ కే మూవీ గ్లింప్స్ ను అమెరికా శాన్‌డియాగాలోని కామిక్ కాన్ ఈవెంట్‌లో శుక్ర‌వారం రిలీజ్ చేశారు. అదిరిపోయే యాక్ష‌న్ సీక్వెన్స్‌, విజువ‌ల్స్‌తో ఈ గ్లింప్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. హాలీవుడ్ స్టాండ‌ర్స్‌లో ఈ వీడియో గ్లింప్స్ ఉందంటూ అభిమానుల‌తో పాటు ప్ర‌భాస్ ఫ్యాన్స్ ప్ర‌శంస‌లు కురిపిస్తోన్నారు. ఈ వీడియో గ్లింప్స్‌లోనే సినిమా టైటిల్‌ను రివీల్ చేశారు. ఈ సినిమాకు క‌ల్కి 2898 ఏడీ అనే పేరును ఖ‌రారు చేశారు. క‌ల్కి అవ‌తారం నేప‌థ్యంలో ప్రాజెక్ట్ కే మూవీని తెర‌కెక్కించిన‌ట్లుగా క‌నిపిస్తోంది.

Kalki
Kalki

కానీ ప్రాజెక్ట్ K కల్కి గ్లింప్స్ మీద అప్పుడే చాలా థియరీస్ మొదలైపోయాయి. కొన్ని థియరీస్‌ను నిశితంగా పరిశీలిస్తే మైండ్ బ్లాక్ కాక తప్పదు. ప్రధానంగా వినిపిస్తున్న ఓ థియరీ ఏంటంటే.. ‘కల్కి’ సినిమా మొత్తం కూడా మహావిష్ణువు ఆయుధాల కోసం జరిగే పోరాటం. రైడర్స్ గా పిలవబడే దుష్టశక్తి సైన్యం దాని అధిపతి తమ దగ్గరున్న మోడ్రన్ వెపన్స్ తో పాటు శ్రీ మహావిష్ణువు అతి పురాతన ఆయుధాలను దక్కించుకోవాలని, తద్వారా ఈ భూమిపై ఆధిపత్యాన్ని కొనసాగించాలని నిర్ణయించుకుంటాడు. అయితే ఏ మహావిష్ణువు ఆయుధాలైతే కావాలనుకుని ఆ దుష్టశక్తి భూమి మీదకు వచ్చిందో… ఆ ప్రయత్నాలను అడ్డుకునేందుకు ఒక్కో ఆయుధానికి ఒక్కో వ్యక్తి.. ఆ ఆయుధం అంశతోనే జన్మిస్తారు. ఇక్కడ మహావిష్ణువు చేతిలో గద, శంఖువు, కమలం, సుదర్శన చక్రం ఉన్నాయి. ఇవ్వన్నీ గ్లింప్స్ లో చూపించారు నాగ్ అశ్విన్.

మొదటగా మహావిష్ణువు గదను కౌమోదకి అంటారు. విష్ణుమూర్తి ఆయుధాల్లో అత్యంత ముఖ్యమైనది ఎందుకంటే కౌమోదకిని Premordial నాలెడ్జ్ కి ప్రతీకగా భావిస్తారు. అలాంటి కౌమిదకి రిఫరెన్స్ దీపికా పదుకోన్. దుష్టుల చేతిలో చిక్కినట్లు చిక్కి వాళ్ల భరతం పట్టే పాత్ర. గ్లింప్స్ ఓపెనింగ్ సీన్ లో ఈ పద్మాన్ని చూపించారు. ఇది ఆయుధం కాకపోయినా ఆయుధాలకు మార్గాన్ని చూపించే సంకేతం. అందుకే రైడర్స్ ఈ పద్మం మీద నుంచి నడుచుకుంటూ వెళ్తున్నట్లు ఓపెనింగ్ సీన్ ఉంది. పరశు అంటే గండ్రగొడ్డలి.. దీన్ని మహాశివుడు విష్ణుమూర్తి ఆరో అవతారమైన పరశురాముడికి వరంగా ఇచ్చారు. ఆ పరశు కోసమే ఓ రోబో ఈ శివాలయంలోకి ప్రవేశించినట్లు చూపించారు.

- Advertisement -

నందకం అంటే కత్తి… నందకం జ్ఞానానికి ప్రతీక. గ్లింప్స్ లో జ్ఞానయోగంలో ఉన్న అమితాబ్ బచ్చన్ కళ్లు తెరిచినట్లు.. ఆతర్వాత తన చేతితో పొడవాటి నందకంతో శత్రుమూకలపై దాడి చేస్తున్నట్లు చూపించారు. సుదర్శన చక్రం, ఇది సాక్షాత్తూ మహావిష్ణువు అంశ. అందుకే కల్కి పాత్ర చేసిన ప్రభాస్ ను చూపించినప్పుడు టెక్నాలజీ ఇంటర్ ఫేస్ లో సుదర్శన చక్రాన్ని పోలిన సింబల్ ను చూపించారు.ఇలా ఈ పాత్రలన్నీ కలిసి మహావిష్ణువు ఆయుధాలను దుష్టుల చేతికి చిక్కకుండా ఎలా కాపాడాయనేది సినిమా అని ఫ్యాన్స్ చెబుతున్న ఈ థియరీలు చూస్తుంటే నాగ్ అశ్విన్ ఏ రేంజ్ లో ప్లాన్ చేశారో అర్థమవుతోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here