Vishwak Sen : ప్రస్తుతం టాలీవుడ్ లో వివాదాలకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే విశ్వక్ సేన్ అని చెప్పే విధంగా ఉండి పరిస్థితి. ఆటిట్యూడ్ ఉన్న ఈ హీరో ఎప్పటికప్పుడు కొత్త వివాదాల్లో చిక్కుకొని వార్తల్లో నిలవడం కామన్ అయిపోయింది. తాను నటించిన ఫలక్‌నుమాదాస్ మూవీ పోస్టర్స్ ను కావాలని చెప్పారని దీని వెనక విజయ్ దేవరకొండ కుట్ర ఉందని అప్పట్లో అతను నేరుగానే విమర్శించాడు. వివాదం సద్దుమణిగింది కానీ ఈ వివాదం కారణంగా అతని సినిమా ఎంతో కొంత సక్సెస్ అయ్యింది.ఇదే కాన్సెప్ట్ అశోకవనంలో అర్జున్ కళ్యాణం టైంలో కూడా విశ్వక్ వాడాడు.
అంతెందుకు రోడ్డు పక్కన లక్ష్మణ్ అనే వ్యక్తితో ప్రాంక్ చేయబోయి సోషల్ మీడియాలో బాగా తిట్లు తిన్నాడు. మరొకసారి ఏకంగా టీవీ9 దేవి నాగవల్లి స్టూడియో నుంచి మర్యాదగా బయటకు వెళ్ళమంది…ఇలా చెప్పుకుంటూ పోతే అతని వివాదాల గురించి ఒక పుస్తకం రాయొచ్చు.అయితే ఇప్పుడు తాజాగా విశ్వ మరోసారి తన ట్వీట్ తో సరికొత్త వివాదానికి తెర లేపుతున్నాడు.
వద్దు అంటే వద్దు అనేది మగవాళ్ళకి కూడా వర్తిస్తుంది.. అందుకే ఎక్కువ హైరానా పడకుండా కాస్త నెమ్మదిగా ఉండండి…మనం ప్రశాంతమైన వాతావరణంలో బతుకుతున్నాం…కాబట్టి రిలాక్స్డ్ గా ఉండండి.. అని అతను పెట్టిన లేటెస్ట్ వి బేబీ డైరెక్టర్ ని ఉద్దేశించింది అని అందరూ అభిప్రాయపడుతున్నారు.
అసలు విషయం ఏమిటంటే.. బేబీ మూవీ సక్సెస్ మీట్ జరిగినప్పుడు.. డైరెక్టర్ సాయి రాజేష్ స్టోరీ గురించి మాట్లాడుతూ.. ఓ హీరోకి తాను స్టోరీ చెప్పడానికి ప్రయత్నించినప్పుడు అసలు వినడానికి కూడా ఇష్టపడలేదు అని అనడం జరిగింది. ఆ సదరు హీరో మరెవరో కాదు.. విశ్వక్ సేన్. సక్సెస్ మీట్ లో పరోక్షంగా తన కనీసం కథ వినలేదు.. అయినా సినిమా సక్సెస్ అయ్యింది అని డైరెక్టర్ ఎద్దేవా చేసినట్లు ఫీల్ అయిన విశ్వక్ తన రేంజ్ లో కౌంటర్ ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఈ ట్వీట్ కి సాయి రాజేష్ స్పందించాడు అంటే…జరుగుతున్న ప్రచారంలో నిజం ఉంది అని అర్థం. సాయి రాజేష్ చెప్పిన ఆ హీరో విశ్వక్ సేన్ అని క్లారిటీ వస్తుంది.