Sharukh Khan : ఒక్కొక్కసారి సినిమాలో తమ క్యారెక్టర్ కు న్యాయం చేయడం కోసం నటీనటులు డి గ్లామర్ పాత్రలు చేయడానికి కూడా సిద్ధపడతారు. ఇప్పుడు ఉన్న ట్రెండ్ కూడా ఎక్కువ మాస్ డి గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇస్తోంది. అయితే చాలామంది నటులు ఆన్ స్క్రీన్ బోడి గుండుతో కనిపించడానికి కూడా వెనకాడ లేదు.
రీసెంట్ గా విడుదలైన షారుఖ్ ఖాన్ జవాన్ మూవీ లో షారుఖ్ ఎవరు ఊహించని విధంగా కంప్లీట్ గుండు గెటప్ లో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇదే రకంగా ఇంతకుముందు హీరోలే కాదు హీరోయిన్లు కూడా అవసరాన్ని బట్టి సినిమాలో గుండుతో కనిపించారు. ఆ మూవీస్ ఏంటో.. ఎలాంటి పరిస్థితుల్లో ఏ సన్నివేశంలో వాళ్ళు అలా కనిపించారో చూద్దామా..
షారుక్ ఖాన్
షారుక్ ఖాన్ ,నయనతార, ప్రియ మణి మరియు విజయ్ సేతుపతి కాంబినేషన్లో తెరకెక్కిన కొత్త చిత్రం జవాన్. జూలై 10 వ తారీకు విడుదలైన ఈ చిత్రం ట్రైలర్లో షారు ఒక ట్రైన్ ఫైటింగ్ సన్నివేశంలో బోడిగుండుతో కనిపించారు. ఈ మూవీస్ సెప్టెంబర్ 7వ తారీఖున వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదలకు సిద్ధంగా ఉంది. మరి ఇందులో షారుక్ గెటప్ వెనక కారణం సినిమా విడుదల తర్వాతే తెలుస్తుంది.
రజినీకాంత్
తమిళ్ ,తెలుగు.. ఇండస్ట్రీ తో సంబంధం లేకుండా సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరో రజనీకాంత్. 2007 శ్రియ మరియు రజనీకాంత్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం శివాజీ. ఇందులో రజినీకాంత్ గుండు తో కనిపించారు.
సూర్య
2005లో గజిని అనే వినూతమైన కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిత్రం లో సూర్య నటించాడు. తెలుగు మరియు తమిళ్ రెండు భాషలలో బాగా సక్సెస్ఫుల్ అయిన ఈ చిత్రం ఆ తర్వాత 2008లో హిందీలో కూడా రీమేక్ చేయబడింది. ఈ మూవీలో సూర్య గుండుతో కనిపిస్తారు.
రన్ వీర్ సింగ్
2017 లో సంజయ్ లీలా బన్సాలి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన పౌరాణిక ప్రేమ కథ చిత్రం బాజీరావు మస్తానీ. దీపికా పదుకొణె మరియు ప్రియాంక చోప్రా నటించిన ఈ చిత్రంలో రన్ వీర్ సింగ్ గుండుతో కనిపిస్తారు.
సత్యరాజ్
2015లో విడుదలై తెలుగు మూవీస్ రేంజ్ పెంచిన చిత్రం బాహుబలి. తర్వాత 2017 లో ఈ చిత్రానికి సీక్వెల్ విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టించింది. ఈ చిత్రాలలో సత్యరాజ్ కట్టప్ప గెటప్ కోసం గుండు లుక్ తో కనిపిస్తాడు.
వెంకటేష్
విక్టరీని తన ఇంటిపేరుగా మార్చుకున్న వెంకటేష్ హిట్ ,ఫ్లాప్ తో సంబంధం లేకుండా టాలీవుడ్ లో అగ్ర నటుడిగా గుర్తింపు పొందారు. 1996 లో వెంకటేష్ ,సౌందర్య కాంబినేషన్లో వచ్చిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు చిత్రంలో నేపాల్ లో జరిగిన ఒక సన్నివేశంలో కామెడీ కోసం గుండుతో కనిపిస్తారు.