Allu Arjun : ఒక్క డైలాగ్‌తో పుష్ప2 మొత్తం లీక్ చేసిన బన్నీ.. చిరంజీవిని మించి పోయాడుగా

- Advertisement -

Allu Arjun : చిరంజీవి తన సినిమాల విషయాలను చిరు లీక్స్ పేరుతో లీక్ చేస్తుంటారు. దీని గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది? అనుకోకుండా ఓ సినిమా వేడుకలో ‘ఆచార్య’ టైటిల్ లీక్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. మెగా అభిమానులు, ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఆ తర్వాత చిరు లీక్స్ పేరుతో తన కొత్త సినిమా విశేషాలను చిరంజీవి చెబుతూ వస్తున్నారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకు? అంటే… ‘చిరు లీక్స్’ గురించి అల్లు అర్జున్ ప్రస్తావించారు. దీంతో ఈ టాపిక్ హైలేట్‌ అవుతోంది.

Allu Arjun
Allu Arjun

‘బేబీ’ చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సక్సెస్‌ మీట్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ‘పుష్ప 2’ అప్డేట్ చెప్పమని అభిమానులు అడిగారు. అప్పుడు ”పుష్ప 2 లీక్స్ ఆ? అబ్బో… ఇది చిరు లీక్స్ కంటే డేంజర్ గా ఉంది” అని అన్నారు. ”సినిమా పేరు ‘పుష్ప 2 – ద రూల్’. ఒకటే ముక్క ఉంటుంది. మామూలుగా చెబుతానని కూడా అనుకోలేదు. కానీ, చెబుతున్నా… ఈడంతా జరిగేది ఒకటే రూల్ మీద జరుగుతుండాది. పుష్పాగాడి రూల్” అంటూ సినిమాలో డైలాగ్ చెప్పారు అల్లు అర్జున్. పెద్ద ఫంక్షన్ పెడితే అభిమానులు ఎక్కువ మంది వస్తారని, అప్డేట్స్ అడుగుతారని, అందుకే చిన్నగా ‘బేబీ’ ఫంక్షన్ చేయమని చెప్పినట్లు అల్లు అర్జున్ తెలిపారు.

పాన్ ఇండియా సక్సెస్ సాధించిన ‘పుష్ప’ చిత్రానికి సీక్వెల్గా ‘పుష్ప 2’ సినిమా రూపొందుతోంది. ‘పుష్ప’లో ‘తగ్గేదే లే’ అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్, ఆ మేనరిజమ్ భాషలకు అతీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘పుష్ప 2’లో అటువంటి సిగ్నేచర్ డైలాగ్ ఉంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ‘‘పుష్ప రెండో భాగంలో భన్వర్‌ సింగ్‌ పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుంది. హీరోకు, ఆ పాత్రకు మధ్య చాలా యాక్షన్‌ సన్నివేశాలు ఉంటాయి. పార్ట్‌ 2 ఎక్కువగా సంఘర్షణల మధ్య తిరుగుతుంటుంది’’ ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పి, అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here