Avinash : బరితెగించిన అవినాష్.. అందరిలో శ్రీముఖి ముద్దు పెట్టాలని చూశాడుగా..

- Advertisement -

Avinash తెలుగు ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడానికి బుల్లితెరపై ఎన్నో డిఫరెంట్ ప్రోగ్రామ్స్, రియాలిటీ షోస్ పోటీ పడుతున్నాయి. దాదాపుగా అన్ని షోలు కూడా కామెడీనే ప్రధానంగా చేసుకుని రూపొందుతున్నాయి. జనాలను ఆకట్టుకుంటూ మంచి టీఆర్పీతో దూసుకుపోతున్నాయి. వాటి కారణంగానే ఎంతో మంది యాంకర్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఫీమేల్ యాంకర్లలో శ్రీముఖి హంగామానే వేరు. ఫుల్ ఎనర్జిటిక్‌గా, జోష్‌తో కనిపిస్తూ సందడి చేస్తుంటుంది.

Avinash
Avinash

షోలు, ఈవెంట్స్ ఏదైనా కానీ శ్రీముఖి ఉంటే ఆ హడావిడే వేరు. ఈ బుల్లితెర రాములమ్మ ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ అనే షో హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతివారం సీరియల్ సెలబ్రెటీలను పిలిచి వాళ్లతో ఆటలు ఆడించి, నవ్వించి, ఏడిపించి మొత్తానికి అయితే ఎంటర్‌టైన్ చేస్తుంది శ్రీముఖి. ఈవారం అలానే ‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’ అంటూ పాత సీరియల్స్‌లోని హిట్ పెయిర్స్‌ను తీసుకువచ్చింది. వాళ్లతో రకరకాల ఆటలు ఆడించింది. అయితే నిఖిల్-కావ్య (గోరింటాకు) జోడికి ఓ టాస్క్ ఇచ్చింది. వాళ్లకి ఒక డైలాగ్ ఇచ్చి ఇలా యాక్ట్ చేయమని చెబుతూ చూపించింది. “పార్థూ ఒక్కసారి వచ్చి నాకు ముద్దు పెట్టు” అంటూ ముక్కు అవినాశ్ చొక్కా పట్టుకుంది.

శ్రీముఖి అలా అడిగేసరికి క్యారెక్టర్‌లో లీనమైపోయి అవినాశ్ కూడా కిస్ ఇచ్చేద్దామని చూశాడు. సడెన్‌గా చూసిన శ్రీముఖి.. అవినాశ్ గూప గుయ్ మనిపించింది. దీంతో వచ్చివాళ్లంతా తెగ నవ్వుకున్నారు. మొత్తానికి సీన్ సరదాగా చేసిన చెంప పగిలినప్పుడు వచ్చిన సౌండ్ మాత్రం దద్దరిల్లింది. ఇక ఈ ఎపిసోడ్‌లో రెట్రో ఓల్డ్ థీమ్ తీసుకుని ముక్కు అవినాష్ ఆ టైప్ కాస్ట్యూమ్స్‌లో వచ్చాడు. ఫైమా, హరి పంచ్‌లు పేల్చారు. ఇక ‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’ అంటూ పాత సీరియల్స్‌లోని ఆర్టిస్టులంతా రకరకాల టాస్కులు, పంచ్‌లు, ముద్దులతో రచ్చ రంబోలా చేశారు. శ్రీముఖి అందర్నీ ఓ ఆట ఆడేసుకుంది. ఇక నటీనటులు కూడా ఎవరూ తక్కువ తినలేదు. నానా హంగామా చేశారు. వారి జోష్ చూసి హోస్ట్ కూడా షాక్ అయ్యింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here