Upasana : ఈరోజు ఉపాసన బర్త్డే సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులు ఒక స్పెషల్ వీడియోను విడుదల చేశారు. రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతుల బిడ్డ కోసం 11 సంవత్సరాలు నిరీక్షించిన ఆ కుటుంబ సభ్యులు , ఉపాసన నెలలు నిండిన తర్వాత కుటుంబంలో ఏర్పడిన ఆత్రుత, బిడ్డను చూడాలి అన్న వాళ్ళ కోరిక తెలియపరిచారు. ఎంతో ఆనందంగా రాబోయే బిడ్డ కోసం వాళ్లు పడ్డ సంఘర్షణను ఈ వీడియోలో తెలియజేశారు.మెగా ఫ్యామిలీలో వారసురాలు క్లీంకార రాక చెప్పలేని ఆనందాన్ని తెచ్చింది.
ఏళ్ల తరబడి ఎదురుచూసిన నిరీక్షణ క్షణంలో వారి సంతోషానికి అవధులు లేవు. గత సంవత్సరం డిసెంబర్ నెలలో చిరంజీవి ఉపాసన మరియు రామ్ చరణ్ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్న విషయం తన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.నేడు తిరిగి ఉపాసన పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన వీడియోలు తొమ్మిదో నెల నుండి అసలు కథ మొదలైంది అని ఉపాసన చెప్పడం.. బిడ్డను ఎప్పుడు చేతుల్లోకి తీసుకుంటానా అని తన ఎదురుచూపు గురించి చిరంజీవి వివరించడం వారి కుటుంబంలోని ఆత్మీయతకు చిహ్నంగా ఉన్నాయి.
అంతేకాకుండా 11 ఏళ్ల నిరీక్షణ తర్వాత తన కూతురు తల్లి కాబోతున్న విషయం తెలిసి తాను ఎంతో ఎక్సైటెడ్ గా ఫీల్ అయినట్టు ఉపాసన తల్లి చెప్పారు.ఇక రామ్ చరణ్ మాట్లాడుతూ …డెలివరీ సమయంలో అక్కడే ఉన్నతను లోపలికి వెళ్లి.. బిడ్డను చేతుల్లో తీసుకున్నాక తెగ సంబర పడ్డట్టు చెప్పారు.
ఈ వీడియోలో వారి సంభాషణతో పాటుగా క్లీంకార బారసాలకు సంబంధించిన క్లిప్స్ ని కూడా చూపించారు. ఈ వీడియోలో రామ్ చరణ్ తన కూతుర్ని చూపించాడు కానీ ముఖం పూర్తిగా రివీల్ చేయకుండా జాగ్రత్త తీసుకున్నారు. తమ కూతురి కోసం ఉపాసన స్పెషల్ గా తనకదిని ఫారెస్ట్ టీమ్ తో డిజైన్ చేయించి దానికి నర్సరీ అని పేరు కూడా పెట్టడం జరిగిందట.