Samantha : హీరోయిన్ సమంత ఇప్పుడు తన ఆరోగ్యంపై పూర్తిగా దృష్టి పెట్టింది. ఇటీవలే ఖుషి, సిటాడెల్ షూటింగ్స్ కంప్లీట్ చేసేసింది. త్వరలోనే మయోసైటిస్ సమస్యకు చికిత్స తీసుకునేందుకు విదేశాలకు వెళ్లనుంది. ఇందుకోసం ఆమె కొన్నాళ్లపాటు సినిమాలకు దూరం కానుంది. ఇప్పటికే తీసుకున్న రెమ్యూనరేషన్స్ సైతం తిరిగి ఇచ్చేసిందని సమాచారం. విదేశాలకు వెళ్లడానికి కంటే ముందు సామ్.. ఇప్పుడు యోగా కేంద్రాన్ని సందర్శించింది.
తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న ఈషా యోగా కేంద్రాన్ని సందర్శిస్తోంది. కొద్ది రోజులుగా ఆమె అక్కడే ఉంటూ ప్రకృతి ఒడిలో విశ్రాంతి తీసుకుంటుంది. ఈషా యోగా కేంద్రంలో పూర్తిగా ఆధ్యాత్మకి చింతనలో మునిగిపోయారు సామ్. ఇక ఆ ఫొటోలు పంచుకున్న సమంత తన ఇన్‌స్టాలో రాస్తూ..’ ఎలాంటి ఆలోచనలు, కదలికలు, మెలికలు తిరగకుండా నిశ్చలంగా కూర్చోవడం దాదాపు అసాధ్యమనిపించింది. కానీ ఈరోజు ధ్యానం అనేది ప్రశాంతత, శక్తి, స్పష్టతకు అత్యంత శక్తివంతమైన మూలమని తెలిసింది. ఇంత సింపుల్‌గా ఉండే ధ్యానం.. ఇంత పవర్‌ఫుల్‌గా ఉంటుందని ఎవరు అనుకోరు.’ అంటూ రాసుకొచ్చింది. కాగా.. ఇటీవలే ఖుషీ షూటింగ్ పూర్తి చేసుకున్న భామ త్వరలోనే వైద్యం కోసం విదేశాలకు బయలుదేరనుంది.
ఇప్పటికే సినిమాలకు బ్రేక్ ఇచ్చినట్లు చెప్పిన సామ్.. త్వరలోనే వైద్యం కోసం విదేశాలకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. గతంలో సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడిన సంగతి తెలిసిందే. అప్పట్లో చికిత్స కూడా తీసుకుంది. కోలుకున్న తర్వాత విజయ్ దేవరకొండ సరసన ఖుషి మూవీ, వరుణ్ ధావన్‌తో కలిసి సిటాడెల్ వెబ్ సిరీస్‌లో నటించింది. ప్రస్తుతం ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి షూటింగ్ పూర్తి చేసుకున్న సమంత ప్రస్తుతం తన ఆరోగ్యంపైనే పూర్తిగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సినిమాలకు బ్రేక్ కూడా ఇచ్చేసింది. త్వరలోనే అమెరికా వెళ్లనున్నట్లు టాక్ వినిపిస్తోంది.