Cheeranjivi : గతం లో జీవిత రాజశేఖర్ మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై ఎన్నో విమర్శలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తాన్ని అమ్ముకుంటున్నాడని , ఇది సేవ కోసం చేస్తున్నది కాదని , వ్యాపారం కోసం చేస్తున్నది అంటూ ప్రజారాజ్యం పార్టీ సమయం లో సంచలన ఆరోపణలు చేసారు. అయితే అప్పట్లో అల్లు అరవింద్ ఇలా అసత్య ప్రచారాలు చేస్తున్నందుకు జీవిత రాజశేఖర్ పై కోర్టు లో కేసు వేశారు.
అప్పటి నుండి ఇది కోర్టు లో జరుగుతూనే ఉంది. అయితే నేడు నాంపల్లి హై కోర్టు దీనికి తుది తీర్పు ఇచ్చింది. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై అసత్య ఆరోపణలు చేసినందుకు గాను జీవిత రాజశేఖర్ కి సంవత్సరం పాటు జైలు శిక్ష విధిస్తున్నామని. అంతే కాకుండా 5 లక్షల రూపాయిలు జరిమానా కూడా విధిస్తున్నామని తుది తీర్పు ఇచ్చింది.
అయితే వీళ్లిద్దరు వెంటనే బెయిల్ మీద విడుదల అయ్యారు. ఈ సంఘటన జరిగి చాలా కాలం అయ్యింది, ఇప్పుడు చిరంజీవి మరియు రాజశేఖర్ స్నేహం గానే ఉంటున్నారు. అయినప్పటికీ కూడా ఇలా అరెస్ట్ అవ్వడం ఏంటి అని నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఒత్తిడి కారణంగానే మేము చిరంజీవి పై అలాంటి కామెంట్స్ చెయ్యాల్సి వచ్చిందని, లేకపోతే ఆయనకీ నాకు వ్యక్తిగతంగా ఎలాంటి గొడవలు లేవని చెప్పుకొచ్చాడు రాజశేఖర్. ఆ తర్వాత కొన్నాళ్ళకు ఇద్దరు మామూలుగానే మాట్లాడుకున్నారు.
రాజశేఖర్ తన సినిమాకి సంబంధించిన టీజర్ ని కూడా చిరంజీవి చేత లాంచ్ చేయించాడు. అంతే కాకుండా రాజశేఖర్ కూతురు కి మెడికల్ సీట్ కూడా రప్పించేలా చేసాడు. ఇదంతా పక్కన పెడితే అసత్య వ్యాఖ్యలు చేసినందుకు రాజశేఖర్ కి తగిన శాస్తి జరిగిందని, న్యాయం ఎప్పటికైనా గెలుస్తుందని మెగాస్టార్ అభిమానులు సోషల్ మీడియా లో హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్స్ వేస్తున్నాడు.