Bollywood 2022 : 2022లో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డ సినిమాలు ఇవే

- Advertisement -

Bollywood 2022 : 2022 సినిమా ఇండస్ట్రీకి కలిసొచ్చిన ఏడాది. ముఖ్యంగా టాలీవుడ్​లో రెండేళ్ల తర్వాత సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. కొన్ని మూవీస్ అయితే తెలుగు ఇండస్ట్రీని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గొప్పగా నిలబెట్టాయి. కానీ ఈ సంవత్సరం బాలీవుడ్​కు ఏమాత్రం కలిసి రాలేదని చెప్పొచ్చు. చాలా వరకు సినిమాలు బాక్సాఫీస్ వద్ద డీలా పడ్డాయి.

2022 లో బీ టౌన్​లో చాలా వరకు మూవీస్​ ప్రేక్షకులను అలరించలేకపోయాయి. ఇక బాయ్ కాట్ మూవ్​మెంట్​ కొన్ని చిత్రాలకు శాపంగా మారింది. భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమాలు కనీసం బడ్జెట్‌ను కూడా వసూలు చేయలేకపోయాయి. 2022లో ప్రేక్షకులను డిసప్పాయింట్ చేసిన సినిమాలేంటో చూద్దామా..?

Bollywood 2022
Bollywood 2022

హీరోపంతి-2

- Advertisement -

బాలీవుడ్‌ టాప్‌ హీరో టైగర్‌ ష్రాఫ్, తారా సుతారియా జంటగా నటించిన హీరోపంతి-2 చిత్రం హిట్‌ కొట్టలేక పోయింది. ఏప్రిల్‌ 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అహ్మద్‌ఖాన్‌ దర్శకత్వంలో రూ.70 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం కేవలం రూ.24.91 కోట్లు మాత్రమే సాధించగలిగింది. భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మాత్రం డల్‌ అయింది.

జయేశ్‌భాయ్‌ జోర్దార్‌

రణ్‌వీర్‌సింగ్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన చిత్రాల్లో ‘జయేశ్‌భాయ్‌ జోర్దార్‌’ ఒకటి. దివ్యాంగ్‌ థక్కర్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బొమన్‌ ఇరానీ, రత్నపథక్‌ షా, జియా వైద్య తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. మే13న విడుదలైన ఈ చిత్రం సినీ ప్రియులను ఆకట్టుకోలేక పోయింది. రూ.86 కోట్లతో రూపొందిన ఈ సినిమా రూ.16.59 కోట్లు వసూలు చేయగలిగింది.

యాక్షన్‌ హీరో

ఆయుష్మాన్‌ ఖురానా తన కెరీర్‌లోనే తొలిసారి యాక్షన్‌ కథాంశంతో ‘యాక్షన్‌ హీరో’ అంటూ సందడి చేద్దామనుకున్నాడు. అయితే, ఎంతో ఆశగా వచ్చిన ఈ హీరోకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి. తాజాగా విడుదలైన ఈ చిత్రం ఇప్పటి వరకు రూ.8.19కోట్లకే పరిమితమైంది.

సామ్రాట్‌ పృథ్వీరాజ్ & రక్షాబంధన్ & బచ్చన్ పాండే

ఈ ఏడాది అక్షయ్ కుమార్​కు అంతగా కలిసి రాలేదు. ప్రేమ, శౌర్యం, ధర్మం మూర్తీభవించిన మహా వీరుడు పృథ్వీరాజ్‌ చౌహాన్‌ పాత్రలో అక్షయ్‌కుమార్‌ నటించిన చిత్రం ‘సామ్రాట్‌ పృథ్వీరాజ్‌‌’. ఈ ఏడాది భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద చతికిలపడింది. రూ.175 కోట్లతో నిర్మించిన ఈ సినిమా రూ.68.06 కోట్లు రాబట్టింది.

అక్కీ హీరోగా తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘రక్షాబంధన్‌’. ఈ సినిమాకు ఆడియన్స్‌ కనెక్ట్‌ కాలేకపోయారు. రూ.100కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం రూ.45.23 కోట్లు సాధించింది. ఈ ఏడాది అక్షయ్​ నుంచి వచ్చిన మరో మూవీ బచ్చన్‌పాండే’. విభిన్న కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో కృతి సనన్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ నాయికలుగా నటించారు. ఈ చిత్రం వసూళ్ల విషయంలో డీలా పడింది. రూ.165కోట్లతో నిర్మించగా రూ.49కోట్లకే పరిమితమైంది.

షంషేరా

బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ‘షంషేరా’. చారిత్రక నేపథ్యంలో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్‌ యాక్షన్‌ చిత్రం అలరించడంలో భారీగా విఫలమైంది. రూ.150కోట్లతో రూపొందించగా రూ.41.5 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది. 2022లోని అతి పెద్ద ఫ్లాపుల్లో ఒకటిగా మిగిలింది.

లాల్‌ సింగ్‌ చడ్డా

బాలీవుడ్‌ అగ్రహీరో అమిర్‌ ఖాన్‌ నటించిన సినిమా ‘లాల్‌ సింగ్‌ చడ్డా’. అమిర్‌ ఖాన్‌ సినిమా వస్తుందంటే ప్రేక్షకులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. అలాంటి వారిని ఈ సినిమా నిరాశపరిచింది. అమిర్‌ ఖాన్‌ సరసన కరీనా కపూర్‌ నటించిన ఈ చిత్రం రూ.180 కోట్లతో తెరకెక్కించారు. నివేదికల ప్రకారం ఈ చిత్రం 59.58 కోట్లు వసూలు చేయగలిగింది.

ధాకడ్

బాలీవుడ్‌ యాక్షన్‌ క్వీన్‌ కంగనారనౌత్‌ నటించిన చిత్రం ధాకడ్‌. మే20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన కంగనా.. మెప్పించలేక ఘోరపరాజయాన్ని పొందింది. దాదాపు రూ.85 కోట్లతో రూపొందించగా కేవలం రూ.2.3కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది.

రన్‌వే 34

బాలీవుడ్‌ అగ్ర కథానాయకులు అమితాబ్‌ బచ్చన్‌, అజయ్‌ దేవగణ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రన్‌వే 34’. అజయ్‌ దేవగణ్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కీలక పాత్ర పోషించింది. 2015లో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూ.65కోట్లతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఏప్రిల్‌ 29న విడుదలైన ఈ చిత్రం రూ.33.51కోట్ల కలెక్షన్లకే పరిమితం అయింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here