Vijay Thalapathy : తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీ కాంత్ తర్వాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో విజయ్. ఆయన రీల్ పైనే కాదు రియల్ లైఫ్ కూడా సాధారణంగా లీడ్ చేస్తుంటాడు. అలాంటి హీరోకు పోలీసులు జరిమానా వేశారు. కారణం ఆయన తప్పు చేశాడు. దళపతి విజయ్ మంగళవారం చెన్నైలో రెండు చోట్ల ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేశాడు. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఆయనకు ఫైన్ విధించారు.

ఇటీవల విజయ్ తన తాజా చిత్రం లియో షూటింగ్ పూర్తి చేసుకున్నాడు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 19న విడుదల కానుంది. ఈ సినిమాను విక్రమ్ ఫేం లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా ఓ క్రైం థ్రిలర్. ఇటీవల రిలీజైన టీజర్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది. లియో మూవీలో దాదాపు కొన్నేళ్ల తర్వాత త్రిష హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ సినిమా తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్ మరో ప్రాజెక్ట్ ప్రకటించాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇటీవలే ఆయన సినిమాలకు కాస్త విరామం ప్రకటించి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఆ వార్తలను నిజం చేస్తూనే విజయ్ విరామ సమయంలో పొలిటికల్ కార్యక్రమాల్లో బిజీగా మారారు. ఆయన తరచూ విజయ్ మక్కల్ ఇయక్కమ్ సభ్యులతో సమావేశం అవుతున్నారు.

ఈ క్రమంలోనే చెన్నైలోని పనయూర్ ఆఫీస్ లో విజయ్ మక్కల్ ఇయక్కమ్ సభ్యులను కలిశారు. సమావేశం కంప్లీట్ చేసుకుని తిరిగి వెళ్తుండగా ఆయన ఫ్యాన్స్ పెద్ద ఎత్తున కారును ఫాలో అయ్యారు. వారి నుంచి తప్పించుకునే క్రమంలో విజయ్ కారు రెండు చోట్ల సిగ్నల్ జంప్ చేశారు. దీంతో కారు నెంబర్ ఆధారంగా విజయ్ కు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించినందుకు రూ. 500 జరిమానా విధించారు. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ బరిలోకి దిగుతుందని సమాచారం.