Rashmika : రౌడీ హీరో విజయ్ దేవరకొండ , నేషనల్ క్రష్ రష్మిక మందన్న మధ్య లవ్ గట్టిగా నడుస్తుంది అని ఎప్పుటి నుంచో రూమర్ ఉన్న సంగతి తెలిసిందే. వారిద్దరు కలిసి చెట్టాపట్టాలేసుకుని.. ముంబయ్ లో డిన్నర్ డేట్లు చేసిన సంగతి కూడా తెలిసిందే. మాల్దీవ్స్ కు ఇద్దరు విడివిడిగా వెళ్లి.. విడివిడిగా ఓకే ప్లేస్ లో ఫోటోలు పెట్టి దొరికిపోయిన సంగతి కూడా తెలిసిందే. ఇంత జరిగినా మా మాధ్య ఏమీ లేదన్నట్టు ఉంటున్నారే తప్పించి.. ఈ విషయాన్ని గట్టిగా ఖండించలేదు. వ్యతిరేకించలేదు. ఇక అప్పుడుప్పుడు ఏదో ఓక సందర్భంలో వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ ను ఆడియన్స్ గాని..నెటిజన్లు కాని గుర్తు చేస్తుంటారు. తాజాగా విజయ్ దేవరకొండ తమ్ముడికి వీళ్లిద్దరి కారణంగా చాలా ఇబ్బందికర పరిస్థితి వచ్చింది.
తన తదుపరి చిత్రం ‘బేబీ’ ప్రమోషన్స్‌లో భాగంగా ఆనంద్ దేవరకొండ తాజగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. విలేకరి అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెబుతూ.. కథ తనకెంతో నచ్చిందని, ఇది తప్పకుండా తన కెరీర్‌కు మంచి విజయాన్ని అందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, విలేకరి.. ‘‘మీ సినిమాలోని ఓ సాంగ్‌ను రష్మిక రిలీజ్ చేశారు కదా. ఆ సాంగ్ ఈవెంట్‌కి వచ్చిన వాళ్లందరూ ఆమెను ‘వదినా’ అని గట్టిగా పిలిచారు కదా..’’ అని అడగ్గా.. ఆనంద్ అసహనం కనబరిచారు. ‘‘నో. నేను దీన్ని ఇక్కడితో ఆపేస్తాను’’ అని బదులిచ్చారు.
ఇదే ఇంటర్వ్యూలో తమ సినిమా పోస్టర్ డిలీట్ చేయడంపై మాట్లాడుతూ.. ‘‘సినిమా టీజర్, ట్రైలర్, మ్యూజిక్కు ఎంతటి ఆదరణ లభించిందో అదేవిధంగా పోస్టర్లకూ మంచి టాక్ వచ్చింది. సినీ ప్రియులు ఎంతగానో మా పోస్టర్లను ఇష్టపడ్డారు. అయితే, రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ చేస్తూ మేము ఒక పోస్టర్ రిలీజ్ చేశాం. దానికి మిశ్రమ స్పందనలు వచ్చాయి. కొంతమంది ‘ఇదేం పోస్టర్’ అని కామెంట్ చేశారు. నెగెటివ్‌గా ఉందన్నారు. దాంతో వెంటనే దాన్ని డిలీట్ చేసేశాం’’ అని చెప్పారు.