తమిళ్, తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు నయనతార.. లేడీ బాస్ గా పిలుస్తుంటారు.. వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ వస్తున్న నయన్ కు అట తమిళ్, ఇటు తెలుగులో కూడా మంచి డిమాండ్ ఉంది.. కేరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు తాను ప్రేమించిన అబ్బాయినే పెళ్లి చేసుకుంది.. ఆమె పెళ్లి చేసుకుంది మరెవ్వరినో కాదు తమిళ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్.. ఏడేళ్లు డేటింగ్ చేసిన నయనతార, విగ్నేష్ శివన్ 2022లో వివాహం చేసుకున్నారు. పెళ్ళైనప్పటి నుండి ఏదో ఒక వివాదం వారిని వెంటాడుతుంది.. ఇప్పుడు మరో వివాదంలో దంపతులు చిక్కుకున్నారు.. వీరిపై మరో కేసు నమోదు అయ్యిందని తెలుస్తుంది..
వీరి వివాహం అనంతరం తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న ఈ జంట ఓ వివాదంలో చిక్కుకున్నారు. తిరుమల మాడవీధుల్లో నయనతార చెప్పులతో సంచరించడంపై హిందూ వర్గాలు మండిపడ్డాయి. టీటీడీ చర్యలకు సిద్ధం కావడంతో క్షమాపణలు చెప్పి బయటపడ్డారు..పెళ్ళైన నెలల వ్యవధిలో కవలలకు తల్లిదండ్రులం అయ్యామంటూ ప్రకటించడం వివాదాస్పదమైంది. సరోగసీ నిబంధనలు ఉల్లఘించారని తమిళనాడు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అయితే తమకు ఐదేళ్ల క్రితమే పెళ్లయింది. సరోగసీ చట్టంలోని అన్ని నియమాలు పాటించామంటూ ఆధారాలు సమర్పించారు. దాంతో వివాదం సద్దుమణిగింది..
విగ్నేష్ శివన్ తండ్రి ఉమ్మడి ఆస్తిని తన తమ్ముళ్లకు చెందకుండా అమ్ముకున్నాడని విగ్నేష్ శివన్ బాబాయిలు అయిన మాణిక్యం, కుంచిత పాదం ఆరోపణలు చేస్తున్నారు. ఉమ్మడి ఆస్తి మాకు తెలియకుండా అమ్ముకున్న నేపథ్యంలో కొన్న వ్యక్తికి డబ్బులు చెల్లించి, తిరిగి ఆస్తి అప్పగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తిరుచ్చి డీజీపీ ఆఫీస్ లో మాణిక్యం, కుంచిత పాదం ఫిర్యాదు చేశారు. తమ ఫిర్యాదులో విగ్నేష్ శివన్, నయనతారలతో పాటు విగ్నేష్ శివన్ తల్లి మీనా కుమారి, కూతురు ఐశ్వర్యల మీద కూడా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. డీజీపీ ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించారు.. దాంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఇకపోతే ప్రస్తుతం నయనతార షారుక్ ఖాన్ కి జంటగా జవాన్ చిత్రంలో నటిస్తున్నారు.