R.P.Patnaik టాలీవుడ్ లో ఎంత మంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నప్పటికీ కొంత మంది మ్యూజిక్ డైరెక్టర్స్ మాత్రం తమకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజి ఏర్పాటు చేసుకుంటారు. పాట వినగానే ఇది కచ్చితంగా ఇతని ట్యూన్ అయ్యుంటుంది అని కచ్చితంగా చెప్పేయగలం. అలాంటి మార్క్ ఏర్పాటు చేసుకున్న సంగీత దర్శకులు ఇండస్ట్రీ లో చాలా అరుదుగా ఉంటారు. వారిలో ఒకరే ఆర్ఫీ పట్నాయక్.
శ్రీను వైట్ల మరియు రవితేజ కాంబినేషన్ లో వచ్చిన ‘నీకోసం’ సినిమా ద్వారా ఇండస్ట్రీ కి సంగీత దర్శకుడిగా పరిచయమైనా ఆర్ఫీ పట్నాయక్ తొలిసినిమా తోనే మంచి గుర్తింపు ని దక్కించుకున్నాడు. ఆ సినిమా పేరు దక్కించుకున్నాడు. ఆ తర్వాత తేజ దర్శకత్వం లో వచ్చిన మొదటి సినిమా ‘చిత్రం’ కి సంగీత దర్శకుడిగా పని చేసాడు. ఆ రోజుల్లో ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో, పాటలు కూడా అదే రేంజ్ సెన్సేషన్ సృష్టించాయి.
ఆ తర్వాత ఆయన వరుసగా నువ్వు నేను, జయం, సంతోషం , నువ్వు లేక నేను లేను, మనసంతా నువ్వే, నీ స్నేహం , దిల్ ఇలా ఎన్నో సంచలనాత్మక చిత్రాలకు సంగీతం అందించి టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసాడు. ఈ చిత్రాలన్నీ ఆ రేంజ్ బ్లాక్ బస్టర్స్ అవ్వడానికి ఆర్ఫీ పట్నాయక్ కాంట్రిబ్యూషన్ చాలానే ఉంది. అందుకే ఆయన ప్రస్తుతం సినిమాలు తగ్గించేసినా కూడా ఆయన బ్రాండ్ ఇమేజి కి ఇసుమంత కూడా క్రేజ్ తగ్గలేదు. ఇప్పటికీ డైలీ టీవీ సీరియల్స్ కి ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని ఇష్టమొచ్చినట్టు వాడేస్తుంటారు.
కేవలం సంగీత దర్శకుడిగా మాత్రమే కాదు, దర్శకుడిగా కూడా ఆర్ఫీ పట్నాయక్ కి ఎంతో మంచి టాలెంట్ ఉందని నిరూపించుకున్నాడు. తెలుగు పలు సినిమాలకు దర్శకత్వం వహించిన ఈయన హాలీవుడ్ లో ‘అమీ’ అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు అనే సంగతి చాలా మందికి తెలియదు, ఈ విషయం స్వయంగా ఆర్ఫీ పట్నాయక్ చెప్తేనే మనకి తెలిసింది. అంటే కాదు హాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘రైటర్స్ సిటీ ఆఫ్ అమెరికా’ లో ఒక సభ్యుడిగా కూడా ఉన్నాడట, ఆర్ఫీ పట్నాయక్ గురించి ఈ షాకింగ్ నిజాలు తెలుసుకొని ఆశ్చర్యపోతున్నారు ఆడియన్స్.