Samantha: దెబ్బకు 2000 కోట్ల రూపాయిల నష్టం.. అందుకే సినిమాలకు దూరం అవుతుందా..?

- Advertisement -

Samantha: ఈమధ్య థియేట్రికల్ బిజినెస్ కంటే కూడా ఓటీటీ బిజినెస్ కి మంచి డిమాండ్ నడుస్తుంది. అందుకే స్టార్స్ కూడా ఎక్సక్లూసివ్ ఓటీటీ కంటెంట్ కి కాల్ షీట్స్ ఇవ్వడానికి రెడీ అయ్యిపోతున్నారు. అలా వస్తున్న ఓటీటీ డీల్స్ ద్వారా కోట్ల రూపాయిలు సంపాదిస్తున్నారు మన స్టార్ హీరోలు/ హీరోయిన్లు. రీసెంట్ గా ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ‘సిటాడెల్’ అనే హాలీవుడ్ వెబ్ సిరీస్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

Samantha
Samantha

ఈ సిరీస్ ని అమెజాన్ ప్రైమ్ సంస్థ నిర్మించి రీసెంట్ గానే స్ట్రీమింగ్ ని మొదలు పెట్టింది. అయితే ఈ సిరీస్ కి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. అమెజాన్ ప్రైమ్ సంస్థకి భారీ నష్టాలను తెచ్చిపెట్టింది అట ఈ సిరీస్. అందుకు కారణం సమంత అనే అంటున్నారు. విషయం లోకి వెళ్తే ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్ లో సమంత మరియు వరుణ్ ధావన్ నటిస్తున్నారు.

ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించారు కూడా, ఇదే ‘సిటాడెల్’ ఒరిజినల్ వెర్షన్ పాలిట శాపం లాగ మారిందని అంటున్నారు. అసలే ఈ వెబ్ సిరీస్ కి యావరేజి రేటింగ్స్ వచ్చాయి, దానికి తోడు రీమేక్ వెర్షన్ కూడా ఉంది అనడం, సమంత లాంటి క్రేజీ హీరోయిన్ ఇందులో నటిస్తుంది అనడం తో,ఈ వెర్షన్ వచ్చినప్పుడు చూసుకోవచ్చు లే అని ఆడియన్స్ ఫీల్ అవ్వడం వల్ల ఈ సిరీస్ అనుకున్న స్థాయికి రీచ్ కాలేదని అంటున్నారు విశ్లేషకులు.

- Advertisement -

ఈ సిరీస్ ని నిర్మించడానికి దాదాపుగా 250 మిలియన్ల అమెరికన్ డాలర్ల బడ్జెట్ ని ఖర్చు చేశారట. అంటే ఇండియన్ కరెన్సీ లెక్కలోకి చూస్తే 2000 కోట్ల రూపాయిలు అన్నమాట. ఇందులో కనీసం పావు శాతం కూడా అమెజాన్ ప్రైమ్ సంస్థకి రికవర్ అవ్వలేదట. దీంతో ఇప్పుడు ఆశలన్నీ సమంత వెర్షన్ మీదనే పెట్టుకున్నారు. ఈ సిరీస్ కి ఫ్యామిలీ మ్యాన్ మరియు ఫర్జి వెబ్ సిరీస్ లను తెరకెక్కించిన రాజ్ & డీకే తెరకెక్కిస్తున్నారు. ఇండియన్ నేటివిటీ కి తగ్గట్టుగా ఈ వెబ్ సిరీస్ లో చాలా మార్పులు చేర్పులు చేశారట, చూడాలి మరి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here