కోట్లాది మంది అభిమానులు మరియు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ‘సలార్’ మూవీ కి సంబంధించిన టీజర్ ఈ నెల 6 వ తేదీ విడుదల కాబోతున్నట్టుగా మేకర్స్ నేడు అధికారిక ప్రకటన చేసారు. సమయం సందర్భం లేకుండా తెల్లవారు జామున 5 గంటల 12 నిమిషాల సమయం కి విడుదల చెయ్యబోతున్నట్టుగా చెప్పుకొచ్చారు.
అందరూ నిద్రపోయే ఆ సమయం లో ఈ టీజర్ ని విడుదల చెయ్యడం ఏమిటి..?, మేకర్స్ కి బుర్ర పని చెయ్యడం లేదా అని ఫ్యాన్స్ అందరూ తిట్టుకున్నారు. మేకర్స్ కి ఆ టైం మంచి ముహూర్తం అని అలా పెట్టి ఉండొచ్చు ఏమో లే అని అందరూ అనుకున్నారు. కానీ ఆ సమయం లో విడుదల చెయ్యడానికి ఒక అద్భుతమైన కారణం ఉందని, బాగా పరిశీలిస్తే అభిమానులకు అర్థం అయ్యింది.
KGF చాప్టర్ 2 చిత్రం క్లైమాక్స్ లో ఇండియన్ ప్రభుత్వం రాకీ భాయ్ ప్రయాణిస్తున్న నౌక పై మిస్సైల్స్ తో దాడి చేసి చంపేస్తుంది. రాకీ భాయ్ సముద్రం లో తనతో పాటుగా తన షిప్ లో ఉన్న సమస్త బంగారం తో మునిగిపోతాడు. ఆయన మీద దాడి జరిగే సమయం 5:12 నిముషాలు. అది మీరు క్రింద ఫోటో లో చూడవచ్చు, సరిగ్గా అదే టైం కి ప్రభాస్ ‘సలార్’ మూవీ టీజర్ కూడా విడుదల కాబోతుంది.
అంటే ప్రశాంత్ నీల్ ముందుగా చెప్పినట్టుగానే సలార్ తో రాకీ భాయ్ కి లింక్స్ ఉన్నాయి అన్నమాట. అంటే విక్రమ్ సినిమాలో ఖైదీ చిత్రం లోని ఢిల్లీ పాత్రకి ఎలా అయితే లింక్ ఉంటుందో, సలార్ తో రాకీ భాయ్ కి అలా లింక్ ఉండబోతుంది అన్నమాట. క్లైమాక్స్ లో సలార్ మరియు రాకీ భాయ్ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే థియేటర్స్ ఓనర్స్ తమ థియేటర్స్ కి ఇన్సూరెన్స్ చేయించుకోవడం మంచిది అని ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు.