నిహారిక కొణిదెల.. ఇటు సినిమాలు చేస్తూనే, అటూ డిజిటల్‌లోను రాణిస్తోన్న ముద్దుగుమ్మ. ఆమె ఇప్పటి వరకు తెలుగులో మూడు చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. మొదటి సినిమా ఒక మనసు’ పరవాలేదనిపంచిన ఆ తర్వాత వచ్చిన ‘హ్యాపీ వెడ్డింగ్’,‘సూర్యకాంతం’ పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ ఆమె నటించిన వెబ్ సిరీస్ ‘ముద్ద పప్పు ఆవకాయ’ మంచి ఆదరణ పొంది నెటిజన్లకు దగ్గరైంది. ఇటీవలే డెడ్ పిక్సెల్స్ అంటూ ఓ వెబ్ సిరీస్’లో నటించింది. ఈ వెబ్ సిరీస్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది.
ఇక అది అలా ఉంటే నిహారిక తన భర్తతో విడిపోయినట్లు ఈ మధ్య కాలంలో తరుచుగా ఓ వార్త హల్ చల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. నిహారిక తన భర్త చైతన్య జొన్నలగడ్డతో విడిపోయినట్లు.. అందులో భాగంగానే ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో కలిసి ఉన్న ఫోటోలను డిలేట్ చేశారని.. అంతేకాదు నిహారికతో చైతన్య ఏ మెగా ఈవెంట్‌లో పాల్గోనడం లేదని అంటున్నారు నెటిజన్స్. ఇక లేటెస్ట్‌గా చైతన్య తన సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. నాలుగు నెలల తర్వాత చైతన్య ఓ లాంగ్ పోస్ట్ చేశారు.
ఈ స్థలం దగ్గరకు రావడానికి నన్ను నడిపించిన అందరికీ కృతజ్ఞతలు. గత 10 రోజులుగా విపస్సనా యోగను చేయడంతో నా జీవితం ఇప్పుడు కాస్తా ఉల్లాసంగా ఉంటోంది. ఒకరి జీవితంలో ఇలా చాలా అరుదుగా జరుగుతుంది. ఎటువంటీ అంచనాలు లేకుండా వచ్చి తమకు తెలియని జ్ఞానంతో బయటకు వస్తానని నేను ఊహించలేదు. ఈ సమయంలో అండగా ఉన్నందకు కృతజ్ఞతలు అంటూ రాసుకున్నారు. అయితే దీని ప్రకారం ఆయన ప్రస్తుతం బాధలో ఉన్నట్లు.. ఈ విపాసన యోగ చేయడంతో కాస్తా సంతోషం, హాయిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిహారికతో విడాకులు నిజమేనని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.