నిహారికా రెండో పెళ్లి చేసుకోబోతుందా? అతన్నేనా?

- Advertisement -

మెగా డాటర్ నిహారిక గత కొద్ది రోజులుగా తన భర్తకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.. వీరిద్దరూ తమ ఫోటోలను సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించడం తో ఆ వార్తలకు ఆజ్యం పోసింది..అలాగే ఈ మధ్య కాలంలో వారు కలిసి కనిపించలేదు. ఎక్కడికైనా నిహారిక ఒంటరిగానే వెళుతున్నారు. ఇటీవల నిహారిక అన్నయ్య వరుణ్ తేజ్ నిశ్చితార్థం జరిగింది. నాగబాబు నివాసంలో జరిగిన వరుణ్-లావణ్య త్రిపాఠీల ఎంగేజ్మెంట్ కి నిహారిక సింగిల్ గా అటెండ్ అయ్యారు. నిహారిక వెంట భర్త వెంకట చైతన్య లేడు. ఈ పరిణామాల నేపథ్యంలో విడాకులు ప్రకటించకున్నా నిహారిక-వెంకట చైతన్య విడిపోయారంటూ వార్తలు వస్తున్నాయి.

నిహారికా
నిహారికా

ఇప్పుడు మరో వార్త ఇండస్ట్రీలో తెగ చక్కర్లు కొడుతుంది.. నిహారిక త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతుందని వార్త చక్కర్లు కొడుతుంది.. అందులో నిజమేంత ఉందో తెలియదు కానీ నెట్టింట మాత్రం తెగ వైరల్ అవుతుంది.. ఇకపోతే తాజాగా చైతన్య చేసిన పోస్ట్ వైరల్ అయ్యింది. ఆయన మహారాష్ట్రలో గల గ్లోబల్ విపాసన మెడిటేషన్ సెంటర్ ని సందర్శించారు. అక్కడ పదిరోజులు ఉన్నారు. మానసిక ప్రశాంత పొందేందుకు చైతన్య ఆ మెడిటేషన్ సెంటర్ కి వెళ్లారు. గొప్ప అనుభూతి కలిగిందని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఊహకు మించిన శాంతి లభించిందని ఆయన అభిప్రాయపడ్డారు…

ఆ పోస్ట్ వైరల్ అవ్వడంతో పాటు వీరిద్దరు విడిపోయారు అనే వార్తలు కూడా మరోసారి బలంగా వినిపిస్తున్నాయి.. నిహారికతో విడాకుల కారణంగా మానసిక వేదనకు గురైన వెంకట చైతన్య ఆ మెడిటేషన్ సెంటర్ సందర్శిచారనే వాదన మొదలైంది. ఇది కూడా ఒక హింట్ అంటూ కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఇవ్వన్నీ ఊహాగానాలు మాత్రమే, అధికారిక సమాచారం లేదు. మరోవైపు నిహారిక కెరీర్ పై ఫోకస్ పెట్టారు. నటిగా, నిర్మాతగా రాణిస్తున్నారు. ఆమె ప్రధాన పాత్ర చేసిన డెడ్ ఫిక్సెల్స్ అనే వెబ్ సిరీస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. అదే విధంగా ఇప్పుడు రెండో పెళ్లి అనే వార్తలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి.. ఆమె చేసుకుంటే ఎవరిని చేసుకుంటుందో అంటూ జనాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.. చూద్దాం ఏం చెప్తుందో..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here