చిత్ర పరిశ్రమలో సావిత్రి తరువాత అంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి సౌందర్య. ఆమె తెలుగులో పాటు ఇతర భాషల్లో వందకు పైగా సినిమాలలో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు.. సినిమా ఇండస్ట్రీలో హోమ్లీ రోల్స్ లో మాత్రమే నటించి సౌందర్య విజయాలను సొంతం చేసుకోవడం గమనార్హం అనే చెప్పాలి. తెలుగు చిత్ర పరిశ్రమలో దాదాపుగా అప్పట్లో స్టార్ స్టేటస్ అందుకున్న హీరోలకు జోడీగా సౌందర్య జతకట్టారు. ఇక ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న స్టార్ హీరోయిన్లలో సౌందర్య ఒక్కరు.
సౌందర్య ఎలాంటి పాత్ర పోషించినా ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేసి అందరి దగ్గరి నుండి ప్రశంసలను అందుకున్నారు. అంతేకాదు.. ఆమె ఎన్నో సినిమాల్లో చీరకట్టులోనే కనిపించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక నటిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న సౌందర్య ఛాన్స్ వస్తే దర్శకత్వం కూడా వహించాలని అనుకున్నారు. కానీ.. దర్శకత్వం చేయాలనే కోరిక తీరకుండానే సౌందర్య మృతి చెందారు.
అయితే సౌందర్య చివరి సినిమా నర్తనశాల కాగా ఈ సినిమా రెండో షెడ్యూల్ సమయానికి సౌందర్య మృతి చెందారు. ఇక సౌందర్య గెలుపు అనే సినిమాలో నటించగా ఈ సినిమా షూటింగ్ పూర్తైనా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా విడుదల కాలేదు. ఈ చిత్రాన్ని ఇంటర్నెట్ లో వెతికినా కూడా లభించదు. ఇండస్ట్రీలో సౌందర్య 25,000 రూపాయల రెమ్యునరేషన్ నుంచి 50 లక్షల రూపాయల పారితోషికం స్థాయికి ఎదిగారు.
సౌందర్య చనిపోవడానికి ముందు తన వదినతో చెప్పిన మాటలు రీసెంట్ గా వెలుగులోకి వచ్చాయి. విమాన ప్రమాదానికి ముందు తన వదినతో సౌందర్య మాట్లాడింది. ఈ సందర్భంగా తన కోసం ఆమెను రెండు వస్తువులు తీసుకోవాలని కోరిందట. కానీ, ఆమె కోరిన వస్తువులు తన దగ్గరికి చేకుండానే చనిపోయింది. ఆమె చివరి సారిగా తన వదినని తీసుకురమ్మని చెప్పిన వస్తువులలో ఒకటి కాటన్ చీర, మరొకటి కుంకుమ. సౌందర్య దగ్గర కాటన్ చీరలు లేకపోవడంతో తన వదిన నిర్మలను కొన్నింటిని కొనమని చెప్పిందట. అప్పటికే ఆమె బీజేపీలో చేరడంతో, ఎన్నికల ప్రచారంలో కాటన్ చీర ధరించి పాల్గొనాలని భావించిందట.
ఆమెకు కుంకుమ అంటే చాలా ఇష్టం. తన నుదుటిన ఎప్పుడూ కుంకుమ పెట్టుకుని కనిపిస్తుంది. అందుకే, కాటన్ చీరతో పాటు కుంకుమ కావాలని తన వదినకి చెప్పిందట. అత్త కోసం నిర్మల వాటిని కొనాలి అనుకుందట. మార్కెట్ కు వెళ్లేందుకు రెడీ కూడా అయ్యిందట. ఆ సమయంలోనే సౌందర్య విమాన ప్రమాదంలో చనిపోయినట్లు తెలియడంతో కన్నీరు మున్నీరుగా విలపించిదంట. తాజాగా ఈ విషయాన్ని నిర్మల వెల్లడించింది.